కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ (Vijay Thalapathy) ..కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక్కడి మిడ్ రేంజ్ హీరోలతో సమానంగా విజయ్ సినిమాలకి కలెక్షన్స్ నమోదవుతూ ఉంటాయి. తెలుగులో విజయ్ కి ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందించిన సినిమా ‘విజిల్’ (Whistle) (తమిళంలో ‘బిగిల్’) అనే చెప్పాలి. ‘ఏ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి అట్లీ (Atlee Kumar) దర్శకుడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది.
తండ్రీ కొడుకులుగా విజయ్ పెర్ఫార్మన్స్ కూడా అద్భుతంగా పండింది. 2019 అక్టోబర్ 25న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా విడుదలై 5 పూర్తికావస్తోన్న నేపథ్యంలో ఒకసారి తెలుగు బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.27 cr |
సీడెడ్ | 2.8 cr |
ఉత్తరాంధ్ర | 1.35 cr |
ఈస్ట్ | 0.69 cr |
వెస్ట్ | 0.65 cr |
కృష్ణా | 0.76 cr |
గుంటూరు | 0.98 cr |
నెల్లూరు | 0.51 cr |
ఏపీ + తెలంగాణ | 11.01 కోట్లు (షేర్) |
‘విజిల్’ తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రానికి రూ.11.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ ని రూ.1.01 లాభాలతో గట్టెక్కించింది ఈ చిత్రం. తెలుగులో విజయ్ కి రూ.10 కోట్ల మార్కెట్ ఏర్పడేలా చేసింది ఈ చిత్రం.