స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా మూడు భాషల్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ముహూర్తం పోస్టర్ కే శంకర్ ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని తెలిసి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అవాక్కవుతున్నారు. శంకర్ ప్రతి సినిమా భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే శంకర్ గత సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యాయి.
అందువల్ల చరణ్ సినిమా విషయంలో శంకర్ ఓ మెట్టు దిగారని ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. శంకర్ చరణ్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ కాగా మిగిలిన నటులను మాత్రం టాలీవుడ్ నుంచి ఎంపిక చేసుకుంటున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ తో పోలిస్తే థమన్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా తక్కువనే సంగతి తెలిసిందే. దిల్ రాజు సైతం భారీ బడ్జెట్ తో నష్టాలు రాకుండా శంకర్ చరణ్ కాంబో మూవీని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమాలకు బడ్జెట్ అదుపులో ఉంటుందనే సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాను కూడా దిల్ రాజు పరిమిత బడ్జెట్ లోనే నిర్మించారు. చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.