Salaar: ‘సలార్‌’లో ‘దేవరత’ తండ్రి ఎవరు? ఇప్పుడు ఇదే చర్చ!

  • December 27, 2023 / 12:12 PM IST

‘సలార్‌’ సినిమా రిలీజ్‌కు ముందు మాట ఇది. సినిమా నుండి రెండు ట్రైలర్లు వచ్చిన తర్వాత. ఎవరికి నచ్చిన కథ వారు రాసుకున్నారు. ఈ సినిమాలో కొడుకు ప్రభాసే కనిపిస్తాడని, రెండో పార్టులో తండ్రి ప్రభాస్‌ కనిపిస్తాడని అన్నారు. కొడుకు దేవా అయితే, తండ్రి సలార్‌ అని కూడా అనేశారు. అయితే సినిమా వచ్చేశాక ఆ ఇద్దరూ ఒకేరనని, తండ్రి పాత్ర ఇంకొకటి ఉంది అని తేలిపోయింది. అయితే ఇప్పుడు ప్రశ్న… ఆ తండ్రి పాత్రలో నటించింది ఎవరు అని?

అవును, ‘సలార్‌’ సినిమాలో దేవా తండ్రి పాత్ర పేరు ‘ధారా’. ఈ పాత్ర గురించి సినిమాలో ఎక్కడా క్లియర్‌గా చూపించలేదు. ఆ ప్రస్తావన కూడా పెద్దగా తీసుకురాలేదు. దీంతో సినిమా మొత్తం పూర్తయిపోయినా దేవరత అలియాస్‌ దేవా తండ్రి ఎవరు అనేది తెలియలేదు. కానీ ఇప్పుడు సినిమా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది ‘సలార్‌’ తండ్రి ఎవరు అవ్వొచ్చు అనే ప్రశ్న వేసింది. దీంతో సోషల్‌ మీడియాలో రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. అయితే ఎక్కువమంది మాత్రం అది కూడా ప్రభాసే అంటున్నారు.

‘సలార్‌’ (Salaar) టీమ్‌ రిలీజ్‌ చేసిన పోస్ట్‌ ప్రకారం చూసుకుంటే… కోరం మీసంతో ఆ మనిషి అచ్చంగా ప్రభాస్‌ లానే ఉన్నాడు. అంతేకాకుండా ఆ పాత్రకు మరొకరిని తీసుకుంటే ఆ రేంజిలో పండకపోవచ్చు కూడా. ఇవన్నీ తేలాలి అంటే ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’ సినిమా రావాల్సిందే. అంతకంటే ముందు ఆ సినిమా షూటింగ్‌ పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఫుటేజ్‌ ఉంది, ఎంత షూటింగ్‌ చేయాలి అనేది కూడా తెలియాలి. ఈ విషయంలో టీమ్‌ నుండి ఎలాంటి సమాచారమూ లేదు.

ప్రభాస్‌ నుండి ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా వెయిట్‌ చేస్తున్న రికార్డు వసూళ్లను ‘సలార్‌’ సినిమా అందించింది. దీంతో ఆ రెండో భాగం కూడా వచ్చి అదరగొట్టాలని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అయితే ప్రభాస్‌ డేట్స్‌, ఇతర నటుల కాల్‌షీట్లు అన్నీ ఎప్పుడు ఒక దగ్గరకు చేరుతాయో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus