సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) .. ఒక దశలో నాలుగు సినిమాలను లైనప్‌లో ఉంచారు. దీంతో ఈ ఏజ్‌లో ఇలాంటి డేరింగ్ మూవ్స్ చాలా పెద్ద విషయమే అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు మళ్లీ ఒక్కో సినిమా ఓకే చేస్తూ వెళ్తున్నారు. ఆ లెక్కన ఇప్పుడు ‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంకా తేలడం లేదు. ‘విశ్వంభర’ (Vishwambhara) అయ్యాక చూద్దాం అనుకున్నారో ఏమో..
ఇప్పుడు సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో చిరు కొత్త కథలు వింటున్నారట. ఈ క్రమంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కొందరు గతంలో చిరంజీవితో పని చేసినవాళ్లు కాగా, మరికొందరు కొత్త దర్శకులు, ఫస్ట్ టైమ్ పని చేయబోయే దర్శకులు ఉన్నారు. దీంతో ‘చిరు లైనప్ ఏంటి?’ అనే చర్చ మొదలైంది. గత ఏడాది కూతురు సుష్మితను (Sushmita Konidela) ఫుల్ టైం ప్రొడ్యూసర్‌గా మార్చే క్రమంలో కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఓకే చేశారు చిరంజీవి.
మలయాళ బ్లాక్‌బస్టర్ ‘బ్రో డాడీ’ రీమేక్ చేయాలనుకున్నారు. అయితే ‘గాడ్ ఫాదర్’ (God Father), ‘భోళా శంకర్’ (Bhola Shankar) ఫలితాలు మొత్తం పరిస్థితిని మార్చేశాయి. ఫలితం చూసి వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అదే కథను రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ (Prasanna Kumar Bezawada) కొన్ని మార్పులు చేసి త్రినాథరావు నక్కినకు (Trinadha Rao) ఇచ్చారు. సందీప్ కిషన్ (Sundeep Kishan) , రావు రమేశ్‌తో (Rao Ramesh) ఆ సినిమా చేస్తున్నారట. దీంతో ఇక ఆ సినిమా లేదని ఫిక్స్ అయిపోవచ్చు. మరోవైపు చిరంజీవి.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక సినిమా బాకీ ఉన్నారట.
ఆ బ్యానర్, సుస్మిత ప్రొడక్షన్ హౌస్ కలసి సినిమా చేసేలా ప్లాన్ చేశారట. హరీష్ శంకర్‌తో (Harish Shankar) ఓ కథ అనుకున్నా అది ముందుకెళ్లలేదట. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ తీసిన మోహన్ రాజా (Mohan Raja) ఓ కథ వినిపించారట. బేసిగ్గా ఆ కథను ఓకే చేసిన చిరు.. పూర్తి స్థాయి కథ సిద్ధం చేయమన్నారట. అది ఓకే అయితే ఆ సినిమానే నెక్స్ట్ వస్తుంది. ఇక చిరుతో సినిమా కోసం చాలా రోజులుగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఏది ఓకే అవుతుందో చూడాలి.