Samantha Divorce: సమంత విడాకుల వెనుక ఉన్న వ్యక్తి ప్రీతమ్ జుకల్కరేనా?

  • October 5, 2021 / 01:57 PM IST

మొన్నటివరకు టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌ అనుకున్న ‘చైసామ్’ లు విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకోవడంతో వాళ్ళ అభిమానులకి పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. గాంధీ జయంతి రోజునాడు అనగా అక్టోబర్ 2న.. నాగ చైతన్య, సమంత లు సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.’మా దారులు వేరవుతున్నాయని… మీడియా వారు మా ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దు అంటూ వాళ్ళు కోరారు.నిజానికి ఈ వార్త పై గత నెల రోజుల నుండీ అనేక చర్చలు జరుగుతున్నాయి. నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్లలో సామ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉండగా.. వీరి విడాకులకు ఓ వ్యక్తి కారణమంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో అతని పేరు బాగా పాపులర్ అయిపోయిందని చెప్పాలి. అతను మరెవరో కాదు ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌. ఇతని గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు, చైసామ్ అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇతన్ని తిట్టిపోస్తున్నారనే చెప్పాలి.33 ఏళ్ళ ప్రీతమ్‌ జుకల్కర్‌ హైదరాబాదీ కుర్రాడే. ఇతనొక ఫ్యాషన్‌ డిజైనర్..(ఇందాక చెప్పుకున్నట్టు). ప్రస్తుతం ఇతను మంచి డిమాండ్ ఉన్న ఫ్యాషన్‌ డిజైనర్‌ అని చెప్పొచ్చు.కొన్నాళ్ల క్రితం సమంత చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంది.

ఆ చేనేత వస్త్రాల డిజైనింగ్ మొత్తం ప్రీతమ్ జుకల్కర్‌ చూసుకున్నాడు.వీరిద్దరికీ పరిచయం అప్పుడే ఏర్పడింది. తర్వాత సమంత ఇతనితో బాగా క్లోజ్ గా ఉంటూ వస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.గతేడాది ప్రీతమ్‌ జుకల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా సమంత తన ఇన్‌స్టాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది.ఇందులో సమంత సోఫాలో పడుకుని ప్రీతమ్‌ ఒడిలో కాళ్లు పెట్టింది. నాలుగేళ్ల బంధం అంటూ ఆ ఫోటోకి ఓ కామెంట్ కూడా పెట్టింది. సమంత పోస్టుకు ప్రీతమ్‌ జుకల్కర్‌ ‘ఐ లవ్‌ యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు.అందుకే సమంత విడాకుల మేటర్ తో ఇతని పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus