కొన్ని సినిమాల్లో చిన్న పాత్ర చేసినా, క్లైమాక్స్‌ఓ వచ్చే క్యారెక్టర్ అయినా, ట్విస్ట్ ఇచ్చే కేమియో అయినా హిట్ అయిపోతూ ఉంటాయి. సరైన క్యారెక్టర్ పడింది అని ఆ నటుడు / నటి ఆనందపడితే… ఏమన్నా యాక్టరా అని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అలాంటి వైబ్ వచ్చిన పాత్ర ‘మంగళవారం’ సినిమాలోని జమీందారు భార్య పాత్ర. ఈ సినిమాల అంతా పాయల్ రాజ్‌పుత్ చుట్టూ తిరిగినా జమీందారు భార్య పాత్ర మాత్రం అట్రాక్టివ్‌గా ఉంటుంది. దీంతో ఆమె ఎవరు అంటూ వెతుకుతున్నారు నెటిజన్లు.
మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘మంగళవారం’. అజయ్ భూపతి చేసిన ఈ బోల్డ్ అండ్ డేరింగ్ స్టెప్‌కు, పాయల్ రాజ్‌పుత్ డేరింగ్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తోంది. పేరుకు పేరు, వసూళ్లకు వసూళ్లను ఈ సినిమా సంపాదించుకుంది. ఈ రోజు నుండి ఆ వైబ్స్ కంటిన్యూ అయితే సినిమా మంచి విజయం సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆదివారం వసూళ్ల తాకిడి కాస్త తగ్గిందని వార్తలొస్తున్నా… అది ప్రపంచకప్ ఫైనల్ వల్లనే అని చెప్పొచ్చు.
ఇక అసలు విషయానికొస్తే… ఈ సినిమా నటన పరంగా ఎక్కువ మార్కులు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కే వస్తాయి. హీరోయిన్లు అంత సులువుగా ఒప్పుకోని పాత్రలో ఆమె తన నటనతో ప్రశంసలు అందుకుంటోంది. అలాగే సినిమాలో మరికొందరు మంచి నటనతో ఆకట్టుకున్నారు. లా సినిమా చివర్లో జమీందారు భార్య పాత్రలో నటించిన దివ్య పిళ్లై ఆకట్టుకుంది. ఆమె మలయాళ నటి. మలయాళంలో చాలా సినిమాలు చేసింది.
టొవినో థామస్ ‘కలా’ సినిమాలతో హీరోకు భార్యగా దివ్య ముఖ్య పాత్రలో కనిపించింది. అలాగే తమిళంలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటించింది. అంతేకాదు తెలుగులో దివ్యకు ఇదే తొలి సినిమా కాదు. నవీన్ చంద్ర హీరోగా ‘దండుపాళ్యం’ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రాజు రూపొందించిన ‘తగ్గేదేలే’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమా, ఆ పాత్ర ఆమెకు మంచి చేయలేదు. కానీ ఇప్పుడు (Mangalavaaram) ‘మంగళవారం’ చేసింది అని చెప్పాలి.