Mahesh Babu: దర్శకులు రెడీ… మరి మహేష్‌బాబు సంగతేంటి?

మహేష్‌బాబు తర్వాతి సినిమా ఏంటి? ఏముంది… త్రివిక్రమ్‌తో SSMB28 అని అంటారా. అది ఓకే… ఆ తర్వాతి సినిమా ఏంటి? దీనికి సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే మహేష్‌బాబుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న దర్శకుల జాబితా చాంతాండంత ఉంది. మహేష్‌ బాబు నుండి సమాచారం పిసరంత ఉంది. అదీ మేటర్‌. ఇటీవల మహేష్‌ జన్మదినం సందర్భంగా అభిమానులు ట్విటర్‌ స్పేస్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది దర్శకులు కూడా మాట్లాడారు. అందులో వారు చెప్పిన మాటలే ఈ కన్‌ఫ్యూజన్‌కి కారణం.

త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మహేష్‌బాబు ఏ సినిమా చేస్తారు అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. రాజమౌళితో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఎప్పుడు అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. వెంటనే అని కొందరు, టైమ్‌ పడుతుందని ఇంకొందరు చెబుతున్నారు. అయితే జక్కన్నతోపాటు మరికొంత మంది దర్శకులు మహేష్‌తో సినిమాకు సిద్ధమయ్యారు. వారి జాబితా చూస్తే… ఏ సినిమా వచ్చినా అదిరిపోతుంది అని చెప్పక తప్పదు.

‘మహర్షి’ తర్వాత మహేష్‌తో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి చాలా రోజుల నుండి వెయిట్‌ చేస్తున్నారు. ఆ మధ్య కుదిరినట్లే కుదిరి తప్పిపోయింది. బాబుతో ఫుల్‌ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ తీస్తానని అనిల్‌ రావిపూడి అంటున్నారు. మరోవైపు బాబీ మాట్లాడుతూ ‘మోసగాళ్లకు మోసగాడు’ లాంటి సినిమా మహేష్‌తో తీస్తా అంటున్నారు. సందీప్‌రెడ్డి వంగా అయితే… మా కాంబినేషన్‌లో సినిమా రావడం, హిట్‌ కొట్టడం పక్కా అంటున్నాడు. వీళ్లు రెడీగా ఉన్నారు… మరి మహేష్‌ ఏమంటాడో.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus