‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు సంబంధించి పుకార్లు వస్తోంది మొదలు.. వినిపించిన అతి ఆసక్తికరమైన విషయం ‘పరశురాముడు’. ఈ సినిమాలో పరశరాముడి పాత్రలో ఓ అగ్ర హీరో నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ విషయంలో ఎలాంటి చర్చా లేకపోయినా.. ఇప్పుడు సినిమా చివరి దశకొచ్చింది అనే వార్తలు వస్తున్న నేపథ్యం.. ప్రచారం ప్రారంభించడంతో ఆ పాత్రలో ఎవరు అనే చర్చ మళ్లీ మొదలైంది.
ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఫాంటసీ + సైంటిఫిక్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా అగ్ర హీరో కనిపిస్తాడని వచ్చిన వార్తల్లో ఎన్టీఆర్ (Jr NTR) పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత ఆ పాత్రలో నాగార్జున (Nagarjuna) కనిపిస్తాడని పుకార్లు వచ్చాయి. ఓ దశలో పరశురాముడిగా బాలీవుడ్ హీరో కనిపిస్తాడని కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ పాత్రలో ఎవరు నటించారనేది తెలియలేదు.
కథ ప్రకారం పరశురాముడి పాత్ర చాలా కీలకం అని అంటున్నారు కానీ ఎవరు అనేది మాత్రం చెప్పడం లేదు. అలా అని ఎవరో వచ్చి ఆ పాత్ర చేశారనే వార్తలూ రావడం లేదు. దీంతో పరశురాముడు ఎవరు అనే చర్చ జోరందుకుంది. మరోవైపు నాలుగో స్క్రాచ్ అంటూ టీమ్ ఇప్పుడు టీజ్ చేస్తోంది. అందులో ఏమన్నా చెబుతారా అంటే అదీ డౌటే.
ఎందుకంటే ఆ నాలుగో స్క్రాచ్ వీడియోలో కమల్ హాసన్ పాత్ర పరిచయం ఉండొచ్చు అని లేటెస్ట్ టాక్. దీంతో పరశురాముడు సంగతి ఎప్పుడు తెలుస్తుందో అర్థం కావడం లేదు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , కమల్ హాసన్ (Kamal Haasan) , దీపికా పదుకొణె (Deepika Padukone) , దిశా పటాని (Disha Patani) తదితరులు ముఖ్య పాత్రధారులు వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 27న సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పేసింది.