Nani: సుజీత్‌ సినిమా కోసం నాని ఎవరిని ఓకే చేస్తాడు? అందుకే లేట్‌ అవుతోందా?

నాని (Nani) – వివేక్‌ ఆత్రేయ(Vivek Athreya)  ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ఆ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య  (D. V. V. Danayya) నానితో మరో సినిమా ప్రకటించారు. సుజీత్‌ (Sujeeth)  దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుంది అని కూడా చెప్పారు. అప్పట్లో ఊపు చూస్తే ‘సరిపోదా శనివారం’ అయిన వెంటనే ఆ సినిమా మొదలవుతుందేమో అని కూడా అనుకున్నారు. కానీ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ‘ది ప్యారడైజ్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. అప్పట్లో టైటిల్‌ చెప్పలేదు అనుకోండి.

Nani

దీంతో ‘నానితో దానయ్య రెండో సినిమా’ ఉంటుందా అనే చర్చ మొదలైంది. ‘సరిపోదా శనివారం’ వచ్చి చాలా రోజులు అయిపోవడం, ‘ప్యారడైజ్‌’ పనులు వేగం చేయడం, మరోవైపు ‘హిట్‌ 3’ షూటింగ్‌ మొదలైపోవడంతో ఇక సుజీత్‌ – నాని సినిమా లేనట్లే అనుకున్నారు. కానీ ఆ సినిమా ఉంది అనేది లేటెస్ట్‌ టాక్‌. అంతేకాదు అని మల్టీస్టారర్‌ అని అంటున్నారు. సుజీత్‌ సినిమాలో హీరో పాత్రతో పాటు మరో కీలకపాత్ర ఉంటుందట.

దాదాపు హీరోకు సమానమైన పాత్ర అని చెబుతున్న ఆ రోల్‌ కోసం తెలుగు నుండి కాకుండా ఇతర భాష పరిశ్రమ నుండి తీసుకుందాం అని సుజీత్‌ అనుకుంటున్నారట. సౌత్‌ సినిమా పరిశ్రమల నుండే హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్‌. అప్పుడు సినిమాకు తెలుగులోనే కాకుండా సౌత్‌లో కూడా బజ్‌ ఉంటుందని ఆలోచన అంటున్నారు. ప్రయోగాలు చేయడానికి నాని ఎప్పుడూ ముందు ఉంటాడు.

తన పాత్రను మించిన పాత్ర సినిమాలో ఉన్నా నాని ఏమీ ఫీల్ అవరు. దానికి లేటెస్ట్‌ ఉదాహరణ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాలో సూర్య పాత్రకు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ లెక్కన ఇప్పుడు సుజిత్ సినిమాలో మరో హీరోను తీసుకోవడానికి నాని జంకరు. అయితే ఆ హీరో ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న. సుజీత్‌ అయితే తమిళం నుండి హీరోను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని టాక్‌.

బయట వాళ్ల బిడ్డను గొప్పగా పెంచి పెద్ద చేయడమే సవాలు: ‘దేవకీ..’ దర్శకుడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus