Ram Charan, Shankar: చరణ్‌ – శంకర్‌ సినిమా మామూలుగా ఉండకూడదు కదా!

  • August 17, 2021 / 08:34 AM IST

శంకర్‌ – రామ్‌ చరణ్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌ అనగానే అంచనాలు ఊహకందని లెవల్‌కి వెళ్లాయి. ఈ సినిమా కాన్సెప్ట్‌ అధికారికంగా ప్రకటించనప్పటికీ… రాజకీయం, సేవ నేపథ్యంలో అని పుకార్లు వచ్చి అంచనాలను అంతకుమించి చేశాయి. అయితే ఇందులో తమన్నా నటిస్తోందని తాజాగా వార్తలు రావడం ఇంకా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అదేంటి మొన్ననే ఇందులో కథానాయిక కియారా అడ్వాణీ అని చెప్పారు కదా అంటారా… ఆమె ఉంది… తమన్నా కూడా ఉంది అంట మరి. అయితే ఓ మెలిక.

తమన్నా ఈ సినిమాలో ప్రతినాయకుడి భార్యగా కనిపించనుందని ప్రాథమిక సమాచారం. తమన్నా లాంటి నటిని ప్రతినాయకుడిగా భార్యగా తీసుకుంటున్నారు అంటే… ఆ ప్రతినాయకుడు ఇంకెంత పెద్ద నటుడు అయి ఉంటాడో అర్థం చేసుకోవాలి అనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. శంకర్‌ సినిమాల్లో విలన్‌ ఎప్పుడూ బలవంతుడే. రీసెంట్‌ సినిమాల్లో మనం ఈ ట్రెండే చూశాం. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాలో కూడా అంతే అంటున్నారు. మరి ఆ హీరో ఎవరు అనేది తెలియాలి.

ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తారనేది కొత్తగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇందులో విలన్‌గా నటుడిని బాలీవుడ్‌ నుండో, లేక మరే వుడ్‌ నుండో తీసుకొస్తారు. కాబట్టి విలన్‌గా తమన్నా లాంటి నాయికను తీసుకున్నారు అంటున్నారు. అయితే ఇక్కడే మరో మాట కూడా వినిపిస్తోంది. తమన్నానే మెయిన్‌ విలన్‌ కూడా అవ్వొచ్చు అనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. అంటే ఈ సినిమాలో తమన్నా వర్సెస్‌ చరణ్‌ చూడబోతున్నామా? ఏమో శంకరే చెప్పాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus