విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాలు ఎన్ని?

అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్లు తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రేక్షకుల సంఖ్యను 50 శాతానికి కుదించింది. ఉదాహరణకు 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో 150 మందిని మాత్రమే అనుమతించాలి అన్నమాట. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల గరిష్ట పరిమితి రెండు వందల మందికి మించరాదని పేర్కొంది. దీని వల్ల నాలుగు వందలు లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో 200 మందిని మాత్రమే అనుమతించాలి. కువైట్ నిబంధనలను పాటించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక లేఖ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల లోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇంకా తమ స్పందన తెలియచేయలేదు. సరే థియేటర్లు తెరుస్తారని అనుకుందాం! విడుదల చేయడానికి సినిమాలు ఉన్నాయా?

కరోనా కారణంగా థియేటర్లు మూసివేయడంతో నాని, సుధీర్ బాబు యాక్ట్ చేసిన ‘వి’ సినిమా సహా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘అమృత రామమ్’ తదితర సినిమాలు ఓటీటలో విడుదల అయ్యాయి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’, రాజ్ తరుణ్ హీరోగా యాక్ట్ చేసిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలు మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిచిన తర్వాత వాటిలో విడుదల చేయడానికి సినిమాలు ఉన్నాయా? రామ్ హీరో గా యాక్ట్ చేసిన ‘రెడ్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఓటీటీ నుండి ఆఫర్లు వచ్చినప్పటికి ఇవ్వలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘ఉప్పెన’ సినిమాను కూడా ఓటిటికి ఇవ్వలేదు.

మరో మెగా మేనల్లుడు సాయి తేజ్ యాక్ట్ చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ త్వరత్వరగా కంప్లీట్ చేస్తున్నారు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేస్తున్న ‘లవ్ స్టోరీ’ కూడా త్వరలో రెడీ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్న ‘రంగ్ దే’, రవితేజ ‘క్రాక్’ సైతం కొన్ని రోజుల షూటింగ్ జరుపుకుంటే రెడీ అవుతాయి. పిల్లి మెడలో ముందు గంట కట్టేది ఎవరు అన్నట్లు… ముందు తన సినిమాను విడుదల చేయడానికి వచ్చే నిర్మాత ఎవరు అని టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. థియేటర్ను తెరిచిన తర్వాత ప్రేక్షకులు వస్తారా? రారా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. అందుకని వేచి చూసి విడుదల చేసే ధోరణిలో నిర్మాతలు ఉన్నారని సమాచారం.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus