Bigg Boss Telugu 5: ట్రోఫీ కొట్టే మొనగాడు అతడేనా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే వీక్ ఓటింగ్ అవుతోంది. ఈసారి ఎలిమినేషన్ అనేది ఫినాలేలో జరుగుతుంది. మొత్తం ముగ్గుర్ని ఎలిమినేట్ చేసి , ఇద్దర్నీ స్టేజ్ పైకి తీస్కుని వచ్చి ఒకర్ని ఫైనల్ విన్నర్ గా చేస్తారు. ఇది ఎప్పుడూ జరిగేదే. అయితే, ముగ్గురు టాప్ 3 ఉన్నప్పుడు క్యాష్ ప్రైజ్ మనీ తీస్కుని వచ్చే ఛాన్స్ ఇస్తారు. మరి ఈసారి దీన్ని ఎలా డిజైన్ చేస్తారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే, టాప్ 3లో ఎవరు ఉంటారు అనేది ఫస్ట్ డే ఓటింగ్ ని బట్టీ గెస్ చేయలేని పరిస్థితి.

అన్ అఫీషియల్ ఓటింగ్ లో గనక చూసినట్లయితే మొదటిరోజు ఓటింగ్ లో టాప్ లో సన్నీ ఉన్నాడు. సన్నీకి హ్యూజ్ గా ఓటింగ్ జరుగుతోంది. అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ పైనా దాదాపుగా సన్నీనే ముందంజలో ఉన్నాడు. ఎక్స్ క్లూజివ్ గా ఫిల్మీ ఫోకస్ కి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే యావరేజ్ గా సన్నీకి 30 నుంచీ 40 శాతం మధ్యలో ఓటింగ్ అనేది జరుగుతోంది.కొన్ని అన్ అఫీషియల్స్ పోలింగ్ లో అయితే 50శాతం కూడా దాటాడు. అంటే దాదాపుగా సగానికి సగం ఓటింగ్ ని కైవసం చేస్కుంటున్నాడు.

ఇలాగే ఇంకా రెండు రోజులు ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు పక్కా.ఇక నెక్ట్స్ సెకండ్ ప్లేస్ లో షణ్ముక్ జస్వంత్ ఉన్నాడు. ఫస్ట్ నుంచీ కూడా వీళ్లిద్దరికీ మొదటి రెండు స్థానాలు వస్తునే ఉన్నాయి. మరోవైపు శ్రీరామ్ చంద్ర రేసులో వెనకబడ్డాడు. షణ్ముక్ కి 25 నుంచీ 30 మద్యలో ఓటింగ్ పర్సేంటేజ్ అనేది జరుగుతోంది. కానీ, శ్రీరామ్ కి 15 పర్సెంట్ ఓటింగ్ కూడా రావడానికి కష్టపడుతున్నాడు. ఇలాగే గనక అయితే, శ్రీరామ్ థర్డ్ ప్లేస్ లోనే సెటిల్ అవ్వాల్సి వస్తుంది.

కానీ, బిగ్ బాస్ టీమ్ అంత ఈజీగా శ్రీరామ్ చంద్రని ధర్డ్ ప్లేస్ లో ఉంచడానికి ఇష్టపడరు. కాబట్టి, ఖచ్చితంగా ట్విస్ట్ ఇస్తారు. ఎందుకంటే, గేమ్ పరంగా కానీ, క్రేజ్ పరంగా కానీ చూస్తే శ్రీరామ్ చంద్రని స్టేజ్ పైకి తీస్కుని వచ్చేలాగానే చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని నమ్మద్దంటూ బిగ్ బాస్ టీమ్ ఇన్ స్ట్రా గ్రామ్ లో చాలాసార్లు చెప్పింది. ఒకవేళ శ్రీరామ్ రెండు మూడు రోజుల్లో ఓటింగ్ పర్సేంటేజ్ పెంచుకుంటే అప్పుడు మిస్డ్ కాల్ డేటాని బట్టీ షణ్ముక్ కి ధర్డ్ ప్లేస్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు.

గట్టిగా మాట్లాడితే శ్రీరామ్ ఓటింగ్ పెంచుకుంటే విన్నింగ్ రేస్ లోకి కూడా వచ్చేస్తాడు. కానీ, ప్రస్తుతం ఒక్కరోజు ఓటింగ్ మాత్రమే కాబట్టి ఇప్పుడే డిసైడ్ చేయలేని పరిస్థితి. సన్నీకి అయితే అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇలాగే మరిన్ని రోజులు ఓటింగ్ జరిగితే సన్నీనే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అయ్యేలాగా కనిపిస్తున్నాడు. మరోవైపు మానస్ అండ్ సిరి ఇద్దరూ కూడా అస్సలు రేస్ లోనే లేరు. సుమారు 10 శాతం ఓటింగ్ లోపే ఇద్దరూ పంచుకుంటున్నారు. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus