‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘యానిమల్’ (Animal) సినిమాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘కబీర్ సింగ్’ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల.. నార్త్ లో అతని పేరు మార్మోగిపోతోంది. అతనితో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు ఎగబడుతున్నారు. కానీ సందీప్ టాలీవుడ్ హీరోలపైనే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ తో (Prabhas) ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా అనౌన్స్ చేశాడు సందీప్. అలాగే అల్లు అర్జున్ తో (Allu Arjun) కూడా సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.
‘స్పిరిట్’ అయితే త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అల్లు అర్జున్ తో సందీప్ సినిమా ఇప్పట్లో కష్టమే. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేసే పనిలో ఉన్నాడు. ఇలాంటి టైంలో రాంచరణ్ (Ram Charan), చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్లతో కూడా సందీప్ సినిమా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనిపై అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
‘గేమ్ ఛేంజర్’(Game Changer) రిజల్ట్ ను మరిపించాలని పరితపిస్తున్నాడు చరణ్. దీని తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో కూడా సినిమా చేయాలి. ఇవి పూర్తయ్యేసరికి 3 ఏళ్ళు టైం పడుతుంది . అలాంటప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎలా సినిమా చేస్తాడు? ఇక చిరు సంగతికి వద్దాం..! సందీప్ కి చిరు అంటే చాలా అభిమానం. అతని ఇంటర్వ్యూల్లో గమనించినట్టు అయితే.. ‘చిరంజీవి అభిమానిని’ అని వంద సార్లు చెప్పి ఉంటాడు.
చిరుతో సినిమా చేయడానికి వంగా రెడీ. ‘మాస్టర్’ (Master) సినిమాలో చిరు సిగరెట్ సీన్ తనకు స్ఫూర్తి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ చిరు ఇప్పుడు ‘విశ్వంభర’ (Vishwambhara) కంప్లీట్ చేస్తున్నాడు. తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా చేయాలి. అటు తర్వాత శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కూడా చిరు కోసం వెయిట్ చేస్తున్నాడు. మధ్యలో బాబీ (K. S. Ravindra) సినిమా కూడా ఓకే అవ్వచ్చు. మరి సందీప్ కి ఛాన్స్ ఎలా దక్కుతుంది. ‘స్పిరిట్’ లో చిరు ఇమేజ్ కి సూట్ అయ్యే మంచి పాత్ర ఏదైనా ఉంటే.. చేసే అవకాశం ఉండొచ్చేమో