బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఫైనల్ గా కెప్టెన్ అవ్వని వాళ్లు ఈసారి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ అవకాశాన్ని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చాడు. ఒక ఇద్దరిని గన్ దగ్గరకి వెళ్లి ఏ ఒక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించాలో చెప్పి, సరైనా కారణాలతో వారి ఫోటోని ఫైర్ చేయమని చెప్పాడు బిగ్ బాస్.
దీంతో జంటలు జంటలు గా వచ్చి ఒక్కొక్కరి ఫోటోలని ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గేమ్ చివరకి చాలా రసవత్తరంగా మారింది. ముందునుంచీ శోభాశెట్టి అశ్వినికి మాట ఇచ్చింది. అమర్ తనని కెప్టెన్ చేశాడు కాబట్టి అమర్ ది , నీది ఫోటో వస్తే నేను అమర్ కే సపోర్ట్ చేస్తానని, అలా కాకుండా వేరేవాళ్లది వస్తే మాత్రం నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఇక అశ్విని, రతిక, అమర్ ఈ ముగ్గురే కెప్టెన్ అవ్వలేదు కాబట్టి వీళ్లలో ఒకరిని హౌస్ మేట్స్ కెప్టెన్ చేద్దామని అనుకున్నారు.
కానీ, చివర్లో గేమ్ లో హైడ్రామా స్టార్ట్ అయ్యింది.శోభాశెట్టి ఇంకా శివాజీ ఇద్దరూ కలిసి అమర్ ఇంకా అర్జున్ ఇద్దరిలో డెసీషన్ తీస్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో శోభాశెట్టి అమర్ కి సపోర్ట్ చేసింది. శివాజీ అర్జున్ వాళ్ల వైఫ్ కి మాట ఇచ్చానని చెప్పి అర్జున్ వైపు మొగ్గాడు. దీంతో ఇద్దరిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. మరోవైపు అమర్ దీప్ చాలా ఎమోషనల్ గా శివాజీని అడుక్కోవడం మొదలు పెట్టాడు.
దీంతో శివాజీ అలా అడగద్దని దమ్ముంటే ఫినాలే టిక్కెట్ వస్తుంది అది ఆడి గెలవమని అన్నాడు. అమర్ ఎంతగా బ్రతిమిలాడినా కూడా శివాజీ కరుణించలేదు. మొదటి నుంచీ శివాజీ అమర్ అండ్ బ్యాచ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ముగ్గురు సీరియల్ బ్యాచ్ కలిసే గేమ్ ఆడుతున్నారని డిసైడ్ అయ్యాడు. అలాగే వాళ్లు కూడా ఏదైనా కూడా కలిసే గేమ్ ఆడారు. ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయినా కూడా విఐపి రూమ్ ని ముగ్గురూ షేర్ చేసుకున్నారు.
అలాగే, శివాజీ గ్రూప్ లో కూడా ఎవరు కెప్టెన్ అయినా యావర్, ప్రశాంత్ కూడా విఐపి రూమ్ షేర్ చేసుకున్నారు. ఇక అమర్ కెప్టెన్ అవ్వడానికి శివాజీ అడ్డుపడ్డాడు. దీంతో బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశాడు. అమర్ ఫోటని, అర్జున్ ఫోటోని ఫైర్ చేశాడు. దీంతో కెప్టెన్సీ టాస్క్ రద్దు అయిపోయింది. ఈవారం (Bigg Boss 7 Telugu) కెప్టెన్ లేకుండానే హౌస్ నడుస్తుంది. శోభాశెట్టి – శివాజీ ఏకాభిప్రాయానికి రాకపోవడమే అమర్ ని కెప్టెన్ ని చేయలేకపోయింది. అదీ మేటర్.