ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..? అన్ అఫీషియల్ పోలింగ్స్ ఏం చెప్తున్నాయంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. హౌస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ఎనౌన్స్ చేసినప్పటి నుంచీ అందరూ లెక్కలు వేయడం మొదలు పెట్టారు. అయితే, ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు వెళ్లిపోబోతున్నారు. ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, అన్ అఫీషియల్ పోలింగ్ లెక్కల ప్రకారం చూస్తే రేవంత్ టాప్ లో ఉన్నాడు. టైటిల్ విన్నర్ రేస్ లో దూసుకుపోతున్నాడు.

ఇక విన్నర్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. తర్వాత ప్లేస్ లో శ్రీహాన్ ఉన్నాడు. వీరిద్దరూ అయితే ప్రజెంట్ విన్నర్ – రన్నర్ కి దగ్గరలో ఉన్నారనే చెప్పాలి. అయితే, రోహిత్ కూడా వీళ్లతో పోటీపడుతున్నాడు. కానీ, ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం కొంచెం తగ్గింది. అలాగే, ఆదిరెడ్డి కూడా కొంచెం తక్కువలోనే ఉన్నాడు. ఇక అమ్మాయిలు అయితే రేస్ లో లేరు. కీర్తి – శ్రీసత్య ఇద్దరికీ టైటిల్ వచ్చే ఓటింగ్ పర్సెంటేజ్ జరగట్లేదు.

కాబట్టి, మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే శ్రీసత్య లేదా కీర్తి ఇద్దరిలోనే ఒకరిని చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మేల్ కంటెస్టెంట్ ని ఎవరినైనా పంపించేయాలి అనుకుంటే మాత్రం ఆదిరెడ్డి ఇంకా రోహిత్ ఇద్దరిలో ఒకరిని పంపించే ఛాన్స్ ఉంది. వీడియో జెర్నీల ప్రకారం చూస్తే కీర్తిది లాస్ట్ లో వస్తోంది. అలాగే, శ్రీహాన్ ది కూడా లాస్ట్ వరకూ ఉంచారు. అంటే, వీరిద్దరినీ సేఫ్ చేసే దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు, శ్రీసత్య జెర్నీ తర్వాత తనకి ఓటింగ్ అనేది కొద్దిగా మెరుగుపడింది. అలాగే, ఆదిరెడ్డి జెర్నీ తర్వాత కూడా తన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకున్నాడు. కానీ, ఈసారి వీరిద్దరూ సేఫ్ జోన్ లో మాత్రం లేరు. కీర్తి, ఆదిరెడ్డి, శ్రీసత్య ఈ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీళ్లలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. అన్ అఫీషియల్ పోలింగ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శ్రీసత్య అయితే టేబుల్ లో బోటమ్ లో ఉంది.

బోటమ్ లో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు కాబట్టి, అన్ని లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీసత్య ఎలిమినేట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అంతేకాదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ అయిపోయినట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొడుతున్నాయి. మరి చూద్దాం.. ఈవారం మద్యలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus