బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రేవంత్ కెప్టెన్ అయిన తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్ మేట్స్ మద్యలో ఇంట్రస్టింగ్ టాస్క్ మొదలైంది. నిజానికి ఇది 7మంది ఉన్నప్పుడు మాత్రమే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో పెట్టేవాడు. కానీ, ఈసారి ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని , అలాగే ఈవారం ఇమ్యూనిటీని ఒకే వారం పెట్టడం విశేషం. ఇప్పటికే నామినేషన్స్ నుంచీ రాజ్ బిగ్ బాస్ చెక్ టాస్క్ లో బిడ్ వేసి గెలిచి ఇమ్యూనిటీని సంపాదించాడు.
ఇప్పుడు మరో పార్టిసిపెంట్ కి ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాబోతోంది. ఇలా ఒకే వారం ఇద్దరు సేఫ్ అవ్వడానికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. బహుశా ఎవరిని సేవ్ చేయాడానికి ఇలా చేశారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని రెండు లెవల్లో నిర్వహించాడు బిగ్ బాస్. ఫస్ట్ గార్డెన్ ఏరియాలో బజర్ ని హౌస్ మేట్స్ కొట్టాల్సి ఉంటుంది. ఇలా బజర్ కొట్టాలంటే, ప్లాస్మాపై ఉన్న ఎమౌంట్ ని చూసి బజర్ నొక్కాల్సి ఉంటుంది.
ఇలా ప్లాస్మాపై ఉన్న ఎమౌంట్ ని విన్నర్ ప్రైజ్ మనీ నుంచీ కోత విధిస్తారు. దీనిని ఆలోచించుకుని ఆ ఎమౌంట్ నచ్చితేనే పార్టిసిపేట్ చేసేందుకు హౌస్ మేట్ బజర్ నొక్కాల్సి ఉంటుంది. ఇలా మూడు ఛాన్స్ లు మాత్రమే బిగ్ బాస్ ఇస్తాడు. అంటే, ఎవిక్షన్ ఫ్రీపాస్ లో ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక ప్లాస్మాపై ఎమౌంట్స్ వచ్చినప్పుడల్లా హౌస్ మేట్స్ ఆలోచనలో పడతారు.ఇలా హౌస్ మేట్స్ లో ముగ్గురు ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం పోటీపడితే., ఈ టాస్క్ లో ఫైమా గెలిచి పాస్ ని సంపాదించినట్లుగా తెలుస్తోంది.
గత సీజన్ లో సన్నీ ట్రక్ టాస్క్ లో భాగంగా ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని గెలుచుకున్నాడు. దానిని తనకోసం కాకుండా కాజల్ కోసం ఉపయోగించాడు. మరి ఇప్పుడు ఫైమా తనకోసం ఈ పాన్ ని ఈవారం ఉపయోగించే ఛాన్స్ లేదు. ఎందుకంటే, ఫైమా ఈవారం కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ లో లేదు. అలాగే వచ్చేవారం ఒకవేళ డేంజర్ జోన్ లో ఉన్నా ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ వల్ల సేవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో మరో రెండు వారాలు ఫైమా సేఫ్ అయితే ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. అదీ మేటర్.