Bigg Boss: ఈవారం కెప్టెన్సీ టాస్క్ భలే ఉందిగా..! రెచ్చిపోయిన హౌస్ మేట్స్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో హ్యూమన్స్ గెలిచినట్లుగా సమాచారం. హ్యూమన్స్ గా ఉన్న అఖిల్, అనిల్, యాంకర్ శివ, మిత్రాశర్మా, అషూరెడ్డిలు టాస్క్ లో గెలిచారు. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే, హ్యూమన్స్ ఈ టాస్క్ లో ఏలియన్స్ పై విజయం సాధించారు. దీంతో హ్యూమన్స్ టీమ్ లో ఉన్న వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.

Click Here To Watch NOW

కానీ, అషూరెడ్డి గేమ్ నుంచీ అవుట్ అయ్యింది కాబట్టి, అషూరెడ్డి కెప్టెన్సీ పోటీదారులుగా అర్హతని కోల్పోయినట్లుగా సమాచారం. అంతేకాదు, సంచాలక్ గా ఉన్న బాబాభాస్కర్ కి కూడా కెప్టెన్ అయ్యే అర్హత లభించింది. దీంతో కెప్టెన్సీ పోటీదారులుగా అఖిల్, అనిల్, మిత్రాశర్మా, యాంకర్ శివ, బాబాభాస్కర్ లు ఎంపిక అయ్యారు. మరి వీళ్లలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం. ఇప్పటికే అనిల్, అఖిల్, యాంకర్ శివలు కెప్టెన్ అయ్యారు.

మిత్రాశర్మా, బాబాభాస్కర్ కి మాత్రం అవకాశం ఇస్తే కొత్త కెప్టెన్ అవుతారు. మరి ఇంటి సభ్యుల సహకారంతో ఏదైనా టాస్క్ పెడితే మాత్రం శివ, అఖిల్ ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా, కొత్త కెప్టెన్ ని ఎంచుకోవాలి అనుకుంటే, బాబాభాస్కర్ లేదా, మిత్రాశర్మాలో ఒకర్ని చేయాలి. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూసినట్లయితే, ఏలియన్స్ మూడో లైఫ్ బాల్ ని కూడా పోగొట్టుకున్నారు. ఈబాల్ ని దక్కించుకున్న అఖిల్ దాన్ని పగలకొట్టి అజయ్ ని గేమ్ నుంచీ తప్పించాడు.

దీంతో ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ అయిన బిందు, అరియానా, హమీదాలు మిత్రాశర్మాని టార్గెట్ చేశారు. దీంతో మిత్రా శర్మా వాళ్లపై ఫుల్ ఫైర్ అయ్యింది. సిగ్గులేదా అంటూ మాట్లాడింది. హమీదా, బిందు ఇద్దరూ మిత్రాకి క్లాస్ పీకారు. చివరికి హ్యూమన్స్ అందరూ స్మిమ్మింగ్ పూల్ లో దిగితే బిగ్ బాస్ వారిని హెచ్చరించాడు. గేమ్ ని పూల్ లో దిగి ఆడకూడదని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి అషూరెడ్డి మైక్ లాక్కోమని సంచాలక్ కి చెప్పాడు. దీంతో అషూరెడ్డి గేమ్ లో సైలెంట్ గా ఉండిపోయింది.

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయి మరీ గేమ్ ఆడారు. నిజానికి ముగ్గురు ఏలియన్స్ బ్రతికే ఉన్నారు కాబట్టి వాళ్లలో ఒకరికి ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ హ్యూమన్స్ లో ఉన్నవారికి కెప్టెన్సీ పోటీదారులుగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఏలియన్స్ లో ఎవరైనా ఒకరు కెప్టెన్సీ పోటీకి అర్హత సంపాదించారా లేదా అనేది తెలియాలంటే మనం టాస్క్ పూర్తి అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus