Allu Arjun, Balakrishna: ‘అన్‌స్టాపబుల్‌’… ‘పుష్ప’ ఎపిసోడ్‌ ఇలా చేశారేంటి!

బాలకృష్ణను అందరూ భోళాశంకరుడు అంటారు, చిన్నపిల్లాడి మనస్తత్వం, బాలయ్యది చాలా సరదాగా ఉండే తత్వం అని కూడా అంటుంటారు. బాలయ్యతో పని చేసే నటులు చాలాసార్లు ఈ విషయం చెబుతూ ఉంటారు. అయితే సాధారణ ప్రేక్షకులు, అభిమానులకు మాత్రం ఈ విషయం చాలా తక్కువగా తెలుసు. ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే… ఇటీవల ప్రసారమైన ‘పుష్ప’ ఎపిసోడ్‌ గురించి చూద్దాం.

‘పుష్ప’ సినిమా విడుదల సందర్భంగా ప్రచారం అనుకోవాలో… ప్రశంస కార్యక్రమం అనుకోవాలో కానీ… టీమ్‌ అయితే కార్యక్రమానికి వచ్చింది. సెలబ్రిటీ గెస్ట్‌ షోలా కాకుండా… అదోలా సాగింది కార్యక్రమం. సుకుమార్ గురించి ఏదైనా తెలుసుకుందాం, రష్మిక గురించి ఇంకొంచెం తెలుసుకుందాం అనుకున్న ప్రేక్షకులకు ఏమీ దొరకలేదు. కేవలం రష్మిక మీద ఉన్న ట్రోల్స్‌ గురించి, విమర్శల గురించి క్లారిఫికేషన్‌ మాత్రమే షోలో ఉంది. ఇక సుకుమార్‌కి ఉన్న కన్‌ఫ్యూజన్‌ను హైలైట్‌ చేసేలా నాలుగైదు డైలాగ్‌లు ఉన్నాయి.

పోనీలే అల్లు అర్జున్‌ వచ్చాక ఏదైనా కొత్త విషయాలు చెబుతారేమో అని అందరూ వెయిట్‌ చేశారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. షోకి వచ్చిన గెస్ట్‌ను కనీసం కూర్చోమని చెప్పకుండా మొత్తం నిలబెట్టేసే కార్యక్రమం ముగించారు. అసలు బన్నీకి సీట్లో కూర్చోవడం ఇష్టం లేదేమో అన్నట్లుగా ఆఖరి పది నిమిషాల ముందు పిలిచి, మాట్లాడి, పొగిడేసి, పొగిడించుకుని ఎపిసోడ్‌ ముగించారు. కాసేపు ‘పుష్ప’ వాక్‌, డైలాగ్స్‌తో సందడి చేశారు. దీంతో ఏంటీ… ఈ ఎపిసోడ్‌ ఇలా చేశారు అని అందరూ అనుకున్నారు.

‘పుష్ప’ ప్రచారం కోసం అల్లు అర్జున్‌, రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీలైనన్ని ప్లాట్‌ ఫామ్స్‌లో మాట్లాడారు. కానీ సొంత ఓటీటీ ‘ఆహా’లో జరిగిన కార్యక్రమానికి ఎందుకు ఇలా చేశారు అనేది తెలియడం లేదు. ఆ నిలబడిన మాట్లాడిన విషయాలు ఎంచక్కా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు కదా. ఏదో ఇంట్లో కుర్చీలు లేకపోవడంతో అలా నిలబెట్టి పంపించేశారు అనేలా చేశారు. మరి ఈ షోను నిర్వహిస్తున్న వాళ్ల ఆలోచన అలా ఉందో, బన్నీకి ఏదైనా అర్జెంట్‌ పని ఉందో అర్థం కావడం లేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus