Anasuya: అనసూయ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉంది.. అప్పుడెందుకు రచ్చ చేసింది!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో యాంకర్ అనసూయ చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ‘మాదా చో*ద్’ అనే డైలాగ్ ఉంటుంది. అది సినిమాలో హీరో పాత్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు చెప్పిన డైలాగ్. కానీ అనసూయ  (Anasuya) దాన్ని సినిమాలోని పాత్రలా కాకుండా కాంట్రోవర్సీ చేసింది.

Anasuya

దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై మండిపడ్డారు. సినిమాకి బజ్ పెరగడానికి ఈ కాంట్రోవర్సీ కూడా కారణమైంది. సరే అక్కడితో విషయం అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ లేదు.. తర్వాత కూడా అనసూయ దీనిని పెద్ద ఇష్యూ చేసింది. ‘లైగర్’ (Liger) సినిమా రిలీజ్ టైంలో కూడా దాని ప్రస్తావన తెచ్చి కౌంటర్లు వేసింది. ‘అమ్మని తిట్టిన పాపం ఊరికే పోదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

తర్వాత కూడా విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ‘ది’ అని పెట్టుకోవడంపై కూడా అనసూయ సెటైర్లు వేసింది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. అనసూయ ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి మేటర్ ఏంటంటే.. రెండు,మూడు రోజుల క్రితం నాని ‘ది పారడైజ్’ (The Paradise) గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇందులో చాలా బూతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్లింప్స్ చివర్లో ఓ ‘ల*జ కొడుకు కథ’ అనే డైలాగ్ ఉంటుంది.

దీనికి ఎటువంటి బీప్స్ వంటివి ఉండవు. అయితే ఈసారి అనసూయ నుండి ఎటువంటి రియాక్షన్ లేదు. విజయ్ విషయంలో అంత రెచ్చిపోయిన అనసూయ.. నాని (Nani)  విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంది అనేది చాలా మంది అర్ధం కావడం లేదు. అయితే ఇందులో హీరో ఓ వేశ్యకి పుట్టిన కొడుకు అని గ్లింప్స్ లో సింబాలిక్ గా చెప్పారు. అయినా అనసూయ రియాక్ట్ అయితే ఆమెకి మద్దతు పలికేవారు ఉండకపోవచ్చు. అందుకే అనసూయ సైలెంట్ గా ఉంది అని కొందరు అనుకుంటున్నారు.

అల్లు – అట్లీ.. ఆ తమిళ్ హీరో కూడా.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus