సినిమా నిర్మాతల మండలి తీసుకునే నిర్ణయాల విషయంలో అందరూ పాజిటివ్‌గా ఉండాలని లేదు. చాలా సందర్భాల్లో అగ్ర నిర్మాతలు ఆ నిర్ణయాల్ని సమర్థించలేదు. ఈ విషయంలో బహిరంగంగా విమర్శలు చేస్తుంటారు కూడా. అయితే ఆ విమర్శలు కొన్ని సందర్భాల్లోనే చేస్తారు అనే అపవాదు ఒకటి ఉంది. తాజాగా మరోసారి అలా అగ్ర నిర్మాతలు స్పందించడంతో ఈ విషయంలో చర్చకు వచ్చింది. వచ్చే సంక్రాంతికి తెలుగు సినిమా వర్సెస్ తమిళ సినిమా అనే చర్చ రావడంతో తెలుగు నుండి అల్లు అరవింద్, అశ్వనీదత్ లాంటి పెద్ద నిర్మాతలు స్పందించారు.
తమిళ సినిమాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆపలేం అని అల్లు అరవింద్ అంటే.. ఎందుకు తమిళ సినిమాను సంక్రాంతికి తెలుగులోకి తీసుకురాకూడదు అని అశ్వనీదత్ అన్నారు. వాళ్ల ఆలోచన కరెక్టే.. ఎందుకంటే అన్ని సినిమాలు మనవి అనుకుని పాన్ ఇండియా అంటూ దూసుకుపోవాలని చూస్తున్నాం. అయితే ఇదే మాట ఓ ఐదేళ్ల క్రితం ఇండస్ట్రీలో ఇదే చర్చ వచ్చినప్పుడు ఎందుకు ఆ నిర్మాతలు మాట్లాడలేదు అనేదే ఇక్కడ చర్చ. ‘ఎంత రజనీకాంత్ సినిమా అయితే మాత్రం..
తెలుగు సినిమాలకు కాకుండా ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వాలా’ అంటూ ‘పేట’ సమయంలో దిల్ రాజు అన్న విషయం తెలిసిందే. అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో దాని మీద ఈ స్థాయిలో చర్చ జరగలేదు. తమిళ సినిమాలు ఇక్కడ రాకూడదా అని ఎవరూ అడగలేదు. అయితే ఇప్పుడు మాత్రం మన నిర్మాతలు అందులోనూ అగ్ర నిర్మాతలకు తమిళ సినిమా మీద ప్రేమపుట్టుకొచ్చింది.
అయితే దీనికి కారణం తర్వాతి రోజుల్లో తమకు చెందిన సినిమాలు తమిళనాట భారీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండటమే అంటున్నారు నెటిజన్లు. అల్లు అరవింద్ విషయానికొస్తే తన తనయుడు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఉంది. అదే అశ్వనీదత్ విషయానికొస్తే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ ఉంది. వీటి రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి.. తమిళనాట ఇబ్బంది రాకూడదు అనే వాళ్లు అలా స్పందించారు అని అంటున్నారు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!