‘ ‘తీన్ మార్’ ని (Teen Maar) కూడా అద్భుతంగా చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి ప్లాప్ సినిమాని రీ- రిలీజ్ చేసి సూపర్ హిట్ చేయాలని అది నా కోరిక. అదేంటో చూపిస్తాను మీకు?’ అంటూ ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) రీ- రిలీజ్ టైంలో బండ్ల గణేష్ (Bandla Ganesh Babu) పలికిన మాటలు ఇవి. ఒక రకంగా బండ్ల గణేష్ ను టాప్ ప్రొడ్యూసర్ లిస్టులో చేర్చింది ఈ సినిమానే..! అలా అని ఇది సూపర్ హిట్ సినిమా అని కాదు. ప్లాప్ సినిమానే..!
కానీ కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన బండ్ల గణేష్… రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన ‘ఆంజనేయులు’ తో (Anjaneyulu) నిర్మాతగా మారాడు అనే విషయం అప్పటికి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ అనే సినిమా తీశాకే… అందరికీ తెలిసొచ్చింది. ఆ టైంలో అందరి మైండ్లో ఒకటే ప్రశ్న? అసలు బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎప్పుడు నిర్మాత అయ్యాడు?2వ సినిమానే పవన్ కళ్యాణ్ తో ఎలా తీసేశాడు? అని అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు.
అయితే అది కాదు విడ్డూరం. ‘తీన్ మార్’ సినిమా ప్లాప్ అయ్యింది. అది తెలుసుకుని పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి ‘గబ్బర్ సింగ్’ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం. అంతకంటే అదృష్టం టాలీవుడ్లో ఏ నిర్మాతకి అయినా దక్కిందా? అయితే ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా.. బండ్ల గణేష్ కి ‘తీన్ మార్’ ప్లాప్ అయ్యింది అనే బాధ ఎక్కువగా ఉన్నట్టు పలుమార్లు చెప్పుకొచ్చాడు. సరిగ్గా తీస్తే అది బ్లాక్ బస్టర్ సినిమా అని అతని అభిప్రాయం తెలిపాడు.
ఒకవేళ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఆ సినిమా చేసుంటే.. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అనేది బండ్ల గణేష్ నమ్మకం. అందుకే ఈ సినిమాని రీ- రిలీజ్ చేయాలనేది అతని ఆలోచన. ఈ మధ్య ప్లాప్ సినిమాలు రీ- రిలీజ్ అయినా సూపర్ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ ప్లాప్ సినిమాల్లో మంచి మ్యూజిక్ ఉంటే.. కచ్చితంగా ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎంజాయ్ చేసినట్టు చేస్తున్నారు. ‘తీన్ మార్’ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ ఉంటుంది.
మణిశర్మ (Mani Sharma) ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా ఇష్టం. మరి బండ్ల గణేష్ త్వరగా ఈ సినిమాని రీ- రిలీజ్ చేస్తే.. కచ్చితంగా ఫ్యాన్స్ ఎగబడి చూసే అవకాశం ఉందనే చెప్పాలి.
Where is the re- release andi… @ganeshbandla garu #14YearsForTeenMaar #PawannKalyan #Teenmar #14yearsofTheenmar #BandlaGanesh https://t.co/xUpbqIClA1 pic.twitter.com/o0jpfz66OO
— Phani Kumar (@phanikumar2809) April 15, 2025