Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ నటుల్ని చూశారా? ఎందుకు తీసుకున్నారో? ఏం చేయించారో?

సినిమా విజయం సాధిస్తే చాలా విషయాలు సైడ్‌కి వెళ్లిపోతాయి. ఫలితం ఏమాత్రం అటు ఇటు అయితే ఇక ఆ సినిమాలో ప్రతి అంశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు. ఇప్పుడు ఈ బోనులోకి వచ్చింది ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా. సంక్రాంతికి ముందు వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సమయానికి ఉంటుందా అంటూ ట్రోలింగ్‌ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా కాస్టింగ్‌ గురించి మాట్లాడుతున్నారు.

Game Changer

మీరు సినిమా చూసినాళ్లు అయితే.. అందులో నామ్‌ కే వాస్తే నటులు చాలామంది ఉంటారు. అంటే ఏదో చిన్న చిన్న నటులు అనుకునేరు. సీనియర్లు అయితే గతంలో అదరగొట్టినవాళ్లు, కొత్తవాళ్లు అయితే రీసెంట్‌గా అదరగొడుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీంతో కాస్టింగ్‌ విషయంలో భారీగా ఆలోచించిన శంకర్‌ అండ్‌ కో. వాళ్లకు ఆ స్థాయిలో స్పేస్‌ ఇవ్వలేదు అని చెప్పాలి.

కావాలంటే మీరే చూడండి.. సినిమా మొదటి ప్లాట్‌ నుండి ఆఖరి ప్లాట్‌ వరకు చాలామంది నటులు కనిపిస్తారు. కానీ ముచ్చటగా మూడోసారి కూడా కనిపించని నటులు, రెండోసారి కనిపించని నటులు కూడా ఉన్నారు అని అంటే అతిశయోక్తి కాదు. రామ్‌ నందన్‌ తండ్రిగా నటించిన నరేశ్‌, సోదరిగా నటించిన అనన్య శర్మ మళ్లీ సినిమాలో కనిపించరు. ప్రియదర్శి, వైవా హర్ష లాంటి వాళ్లూ ఇలా నటించినవాళ్లే.

వెన్నెల కిషోర్‌, సత్య, పృథ్వీ, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌ లాంటివాళ్లూ పెద్దగా స్క్రీన్‌స్పేస్‌ పొందలేకపోయారు. ఇదంతా చూస్తుంటే ముందుగా అనుకున్న కథ, రాసుకున్న సీన్లకు సినిమాలో ఉన్న సీన్లకు పొంతన లేదు అంటున్నారు. అందుకే ఆ పాత్రలు అక్కడితో ఆగిపోయాయి. అయితే ఇదంతా ఫాస్ట్‌ ఎడిటింగ్‌లో భాగంగా జరిగింది అని అంటున్నారు. నిడివి ఎక్కువయ్యేసరికి ఇలా చేశారు అని అంటున్నారు.

ఏదైతేనేం సినిమా కథ విషయంలో, హీరోల ఇమేజ్‌ విషయంలో పట్టు కోల్పోయారని విమర్శలు ఎదుర్కొంటున్న శంకర్‌.. కాస్టింగ్‌ను హ్యాండిల్‌ చేయడంలోనూ విఫలమవ్వుతున్నారని అర్థమవుతోంది. ‘భారతీయుడు 2’ విషయంలో కాస్త అటు ఇటుగా ఇలానే జరిగడం గమనార్హం.

Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’ 2వ రోజు కూడా యావరేజే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus