Bheemla Nayak Release Date: సంక్రాంతి ఫైట్‌కి ‘భీమ్లా ’రెడీగా లేడా..!

సంక్రాంతికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అవ్వడం లేదు అని తెలియగానే… వరుసగా చిన్న సినిమాలు వరుస కట్టేశాయి. సుమారు 10 సినిమాలు ‘నేనున్నా’ అంటూ వచ్చేశాయి. ఇవి కాకుండా నాగార్జున – నాగ చైతన్య ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతికే అని ప్రకటించేశారు. అయితే టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఉన్న ఏకైక డౌట్‌… ‘భీమ్లా నాయక్‌’ ఏం చేస్తాడు. ఎందుకంటే ‘సంక్రాంతిని వదిలేది లేదు అంటూ ఇన్నాళ్లూ భీష్మించుకుని కూర్చున్న భీమ్లా ఇప్పుడు వస్తాడా? రాడా?. ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది.

సంక్రాంతి సినిమాల జాబితాలో తొలి నుండి ఉన్న సినిమా, ఆఖరి వరకు నిలిచి… నిర్మాతల పోటీలోలో వెనుకడుగు వేసిన సినిమా ‘భీమ్లా నాయక్‌’. సంక్రాంతి సీజన్‌లో ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి పాన్‌ ఇండియాలకు దారి వదిలేద్దురూ అంటూ చాలామంది ‘భీమ్లా నాయక్‌’ నిర్మాతలను కోరారు. అయితే తప్పుకునేది లేదంటూ ఆ టీమ్‌ నుండి సంజ్ఞలు వచ్చాయి. ఇంకొందరు అయితే బంతి పవన్‌ కల్యాణ్‌ కోర్టులో ఉంది అని అన్నారు కూడా. ఫైనల్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆధ్వర్యంలో సయోధ్య కుదిరి… సినిమాను వాయిదా వేయించారు.

ఇప్పుడు ఒమిక్రాన్‌ పరిస్థితుల నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముందుగా జరిగిన పరిణామాల ప్రకారం తిరిగి ‘భీమ్లా నాయక్‌’ సంక్రాంతికి వచ్చేయాలి. కానీ ‘భీమ్లా..’ టీమ్‌ నుండి ఎలాంటి స్పందనా లేదు. వస్తున్నారా? లేదా? అనేది చెప్పడం లేదు. దీంతో చిన్నసినిమాలన్నీ వరుస కట్టేశాయి. మరి పవన్‌ కల్యాణ్‌ ఏమంటాడు? నిర్మాతలు ఏమంటారో చూడాలి. ఒకవేళ పవన్‌ ‘రండి సంక్రాంతికి వెళ్దాం’ అంటే ఈ చిన్న సినిమాలన్నీ మళ్లీ తిరుగుటపాలో ఇంటికెళ్లాల్సిందే.

అయితే వీటిలో ఆడేవెన్నీ, ఆడనివెన్నీ అనేది పక్కన పెడితే… అసలు ఆ రోజుకు పోటీలో నిలిచేవి ఎన్ని అనేదే విషయం. నిజానికి ‘సర్కారు వారి పాట’ కూడా సంక్రాంతికే రావాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రిక్వెస్ట్‌తో ముందుగా వెనక్కి వెళ్లింది ఆ సినిమానే. అయితే ఆ తర్వాత సినిమా షూటింగ్‌ ఆగిపోవడంతో… పూర్తవ్వలేదు కానీ. లేదంటే ఆ సినిమా కూడా ముందుకు రావాల్సి వచ్చేది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus