Koratala Siva: విజయమొస్తే దర్శకులకు.. అపజయమొస్తే తీసుకోవాలిగా!

గత ఆరు నెలలుగా టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఐదారు వచ్చి ఉంటాయి. ఆ సినిమాల ఫలితం హీరోల వాటాలోకి ఎంత వెళ్లిందో, దర్శకుల వాటాల్లోకి కూడా అంతే వెళ్లింది. ఆ హీరోను.. ఆ దర్శకుడిగా అద్భుతంగా చూపించారు అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అయితే హీరోల కంటే దర్శకులకే ఎక్కువ పేరొచ్చింది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ అంటే రాజమౌళి మాయ అని, ‘కేజీయఫ్‌ 2’ అంటే ప్రశాంత్‌ నీల్‌ పర్‌ఫెక్ట్‌ వర్క్‌ అని అన్నారు. మరి ఫ్లాప్‌ సినిమా వస్తే ఏం చేయాలి.

టాలీవుడ్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ అంటే… ‘ఆచార్య’ డిజాస్టరే. మెగాస్టార్‌, మెగాపవర్‌స్టార్‌ను పెట్టుకుని సరైన సినిమా ఇవ్వలేకపోయారు అంటూ కొరటాల శివను ఆడిపోసుకుంటున్నారు నెటిజన్లు. అంతమంది కాస్టింగ్‌ ఇచ్చాక అవుట్‌పుట్‌ ఇలా ఇస్తే ఎలా అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం కొరటాల నుండి మంచి అవుట్‌పుట్‌ తెప్పించుకోలేదు అంటూ మెగా ఫ్యామిలీని అంటున్నారు. ఈ రెండూ నిజమే అనుకుందాం. అయితే ఈ సినిమా ఫలితానికి దర్శకుడిని బాధ్యుణ్ని చేయకూడదు అనేవారూ ఉన్నారు

అలాంటివారి కోసమే ఈ ప్రశ్న. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టినప్పుడు దర్శకుడి గొప్పతనాన్ని అంతెత్తున పొగుడుతున్నప్పుడు సినిమా పోయినప్పుడు అంతే స్థాయిలో అనడం సహజమే. ఏమంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంలో అగ్ర వాటా రాజమౌళికిచ్చింది టాలీవుడ్‌. ‘కేజీయఫ్‌ 2’ విషయానికొస్తే 50 శాతం కంటే ఎక్కువ పేరు ప్రశాంత్‌ నీల్‌కి ఇచ్చేశారు. ‘పుష్ప’ సంగతి కూడా దాదాపు ఈ రెండు సినిమాల్లానే ఉంటుంది.

అంతెందుకు ‘మిర్చి’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’ సినిమాల విజయాలకు కొరటాల బాధ్యత తీసుకున్నారుగా. మరి ‘ఆచార్య’ పరాజయ ఫలితం ఆయనకు ఇవ్వొద్దు అంటే ఎలా. అయినా సినిమా పరాజయంపై ఆయన ‘ఈ తప్పు నాది కాదు’ అని అనలేదు. కామ్‌గా ఉన్నారు ఇప్పటివరకు. కానీ కొంతమంది మాత్రం ఆయన సినిమాలో ఎవరెవరో వేలు పెట్టారని అందుకే పోయిందని అంటున్నారు. హిట్‌ వస్తే మాది, ఫట్‌ అయితే మీది అని దర్శకులు ఎప్పుడూ అనరు. కాబట్టి మిగిలిన వాళ్లు ఆయన తరఫున ఆయన అనని మాటల్ని అనకూడదు. ఏమంటారు?

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus