బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఈవారం బిగ్ బాస్ ఇచ్చిన ట్రక్ టాస్క అనేది మంచి మజా ఇచ్చింది. ట్రక్ సౌండ్ వచ్చిపుడల్లా హౌస్ మేట్స్ ట్రక్ లో ఎక్కడానికి ట్రై చేయాలి. అందరికంటే ముందు ట్రక్ లో కూర్చున్న వ్యక్తి డైరెక్ట్ గా పోటీదారుడు అయిపోతాడు, అలాగే, అక్కడ మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరినీ పోటీ నుంచీ తప్పించాలి. మళ్లీ ఈ ఇద్దరిలో ఒకరిని ట్రక్ లో కూర్చున్న వ్యక్తి సెలక్ట్ చేయచ్చు. ఇలా ట్రక్ సౌండ్ వచ్చినపుడల్లా ట్విస్ట్ ఏంటంటే, ప్లాస్మాపై ప్రైజ్ మనీలో కోత చూపిస్తారు.
స్టేషన్ స్టేషన్ కి ఇది మారుతుంది కూడా. అలాగే, ట్రక్ లో ఉన్నవాళ్లు, పోటీ నుంచీ తప్పుకున్నవాళ్లు మళ్లీ గేమ్ ఆడటానికి లేదు. ఫస్ట్ రౌండ్ లో ట్రక్ హారన్ ని కొట్టిన ఆదిరెడ్డి బిగ్ బాస్ తో బేరం చేశాడు. గరిష్టంగా 2 లక్షల లోపు చెప్పమని అన్నప్పుడు ఆదిరెడ్డి 1 లక్షరూపాయల బిడ్ వేశాడు. దీంతో లక్షరూపాయల ప్రైజ్ మనీ కోతతో కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. దీనిని తర్వాత రాజ్ ఖండించాడు. నువ్వు బిగ్ బాస్ కి ఇంకా తగ్గించి చెప్పాల్సింది అన్నాడు.
దీనికి ఒక కారణం ఉంది ఏంటంటే., ఫస్ట్ రౌండ్ లో ఆదిరెడ్డికి బిగ్ బాస్ ఎలాంటి ధరని ప్లాస్మాపై నిర్ణయించలేదు. కానీ, మిగతా వాళ్లకి మాత్రం ప్లాస్మాపై ధరని నిర్ణయించాడు. దీనికి కూడా డిబేట్ లేకుండానే పోటీపడ్డారు హౌస్ మేట్స్. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు చూసారే తప్ప, బిగ్ బాస్ ఎమౌంట్ ప్రైజ్ మనీ తగ్గిపోతుందని చూడలేదు. ఈవిషయంలో రాజ్ ఆదిరెడ్డిని ఇంకా తక్కువ ధర అడాల్సింది. లక్షరూపాయలు చెప్పేశావ్ అని ప్రశ్నించాడు. దీంతో ఆదిరెడ్డి మీరు ఇలా అడాగలనే బిగ్ బాస్ ఇలా చేశారంటూ కవర్ చేశాడు.
అంతేకాదు, ఆతర్వాత ఫైమాతో మాట్లాడుతూ అసలు రాజ్ కి ఈవారం పాయింట్ లెస్ గా మాట్లాడుతున్నాడు. పాయింట్స్ లేకుండా వెళ్తున్నాడని అనిపిస్తోందంటూ కబుర్లు చెప్పాడు. రాజ్ తనని ప్రశ్నించి లాజికల్ గా లాక్ చేసి పాయింట్ అడిగాడని,మిగతా గేమ్ పైన కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడని, అస్సలు తన పాయింట్స్ కరెక్ట్ గా ఉండటం లేదని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, మార్నింగ్ సాంగ్ అవ్వగానే ఈవారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారని ప్రిడిక్షన్ శ్రీసత్యని అడిగాడు. దీంతో శ్రీసత్య కీర్తి పేరు చెప్పింది. ఆదిరెడ్డి కూడా నాకు అలాగే అనిపిస్తోందని చెప్పాడు.
ఇక ఈటాస్క్ లో ఫస్ట్ ఆదిరెడ్డి, తర్వాత రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆ తర్వాత లాస్ట్ లో ఇనాయా ట్రక్ హారన్ కొట్టి మరీ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. చివర్లో మెరీనా, ఇనాయా, కీర్తి ముగ్గురు ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఎలిమినేట్ అవ్వడానికి ఇష్టపడలేదు. చాలాసేపు డిస్కషన్స్ అయిన తర్వాత కీర్తి – మెరీనా ఇద్దరిలో కీర్తిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత మెరీనా ఇంకా ఇనాయా పోటీపడి ఇనాయా కెప్టెన్సీ పోటీదారులు అయ్యింది. ఫైనాల్ గా రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇంకా ఇనాయా వీళ్లు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. మరి వీళ్లలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!