నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ నుండి మాస్ ఆంథెమ్ రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు..
నిన్ను తలచుకున్నవారు లేచి నించుని మొక్కుతారు.. తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. నమ్ముకున్న వారి కోసం.. అగ్గిమంటే నీ ఆవేశం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేడే లేడయ్యా.. ఆ మెలతాడు కట్టిన మొగోడింకా పుట్టనేలేదయ్యా.. జై బాలయ్య.. జై జై బాలయ్య’’ అంటూ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ సాగే ఈ పాటకి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. కరీముల్లా పాడారు. బాలయ్య బాబు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన ఈ పాట చాలా త్వరగా ట్రోలింగ్స్‌కి గురైంది.
కొందరు సినీ అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ బీభత్సంగా కామెంట్స్ చేశారు. థమన్ ట్యూన్ కాపీ అని.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాటలా ఉందని.. శాస్త్రి లిరిక్స్ కూడా ‘భరత్ అనే నేను’ లా ఉన్నాయని.. ఆయన పేరు ముందు సరస్వతీ పుత్ర అనే బిరుదు అవసరమా? అంటూ చెలరేగిపోయారు. దీంతో హర్ట్ అయిన శాస్త్రి సోషల్ మీడియా ద్వారా ఆ విమర్శలపై స్పందించారు. కొంతమంది సినిమా పేరు ‘వీర సింహా రెడ్డి’ కదా.. మరి ‘జై బాలయ్య’ సాంగ్ ఏంటి? అనే సందేహం వెలిబుచ్చారు. దీని గురించి టీం రియాక్ట్ అయినట్లు ఫిలింనగర్ సమాచారం..
సినిమాలో బాలయ్య తండ్రీ కొడుకులుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఫాదర్ క్యారెక్టర్ పేరు ‘వీర సింహా రెడ్డి’ కాగా.. ఆయన తనయుడి పాత్ర పేరు ‘బాల నరసింహా రెడ్డి’ అని.. ఆ పాత్ర పరిచయ నేపథ్యంలోనే ఈ ‘జై బాలయ్య’ పాట వస్తుందని చెప్పారని అంటున్నారు. ‘అఖండ’ లో బాలయ్య క్యారెక్టర్ పేరు కాకపోయినా ‘జై బాలయ్య’ సాంగ్ పెడితే పెద్ద హిట్ అయింది. మరి ఇందులో పాత్రపేరులోనే బాల ఉంది కాబట్టి థియేటర్లో ఎలా అనిపిస్తుందో చూడాలి. మొత్తానికి ‘జై బాలయ్య’ సాంగ్ వ్యూస్‌తో పాటు వివాదాలకూ కేంద్ర బిందువుగా మారింది..