NTR, Charan: చరణ్ బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్న తారక్.. బన్నీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Charan) పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. మార్చి 27వ తేదీ రామ్ చరణ్ తన 38వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలను మెగాస్టార్ చిరంజీవి పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రెటీల అందరిని ఆహ్వానించి ఈయన ఘనంగా పార్టీ ఇచ్చారు.ఇండస్ట్రీకి చెందినటువంటి దర్శక నిర్మాతలు యంగ్ హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలందరూ పుట్టినరోజు వేడుకలకు హాజరైనప్పటికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదు. సాధారణంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది. అయితే ఆ అనుబంధం RRR సినిమాతో మరింత బలపడింది.నిజ జీవితంలో కూడా వీరిద్దరూ స్నేహితులుగా కాకుండా అన్నదమ్ములుగా ఎంతో సఖ్యతగా ఉంటారు. ఇలా ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి తారక్ చరణ్ బర్త్ డే కి రాకపోవడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాకపోవడానికి గల కారణం ఆయన తన సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటమే.కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇకపై ఎలాంటి వాయిదాలు లేకుండా శరవేగంగా షూటింగ్ పనులు జరిగేలా ప్లాన్ చేశారు. అందుకే తారక్ ఈ సినిమా పనులలో బిజీగా ఉండటంవల్ల చరణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదని తెలుస్తుంది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్క హీరో కూడా చరణ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనారు. కానీ తనకు వరుసకు బావ అయినటువంటి అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు.ఇలా అల్లు అర్జున్ కూడా చరణ్ పుట్టినరోజు వేడుకలకు రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు అనుకుంటే పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇలా సుకుమార్ పాల్గొన్నప్పటికీ బన్నీ పాల్గొనకపోవడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus