ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల గురించి, అందులోనూ ఒకే కుటుంబం నుండి వచ్చిన స్టార్ హీరోల గురించి మరో సీనియర్ స్టార్ నటుడు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్టార్ నటుడు ఆ మాట ఎందుకు ఇలా అన్నారు, కారణమేంటి అనేది తెలియకుండా విషయమైతే వైరల్‌గా మారింది. దీంతో ఇప్పుడు ఆయన మీద ట్రోలింగ్ మొదలైంది. అంత పెద్ద వ్యక్తి మీద ట్రోలింగ్ ఎందుకు అనే డౌట్ మీకు రావొచ్చు. ట్రోలింగ్ తప్పే… కానీ ఆయన అన్న మాటలు సత్యదూరం కావడమే అందుకు దారి తీసింది.
మొన్నీ మధ్య మేడే సందర్భంగా చిరంజీవి ఓ సభలో మాట్లాడుతూ ‘తాను కూడా కార్మికుడినేనని, కార్మిక ఆసుపత్రికి తన వంతు సాయం అందిస్తాన’ని చెప్పారు. ఆ విషయాన్ని పట్టుకుని కోట వేరే విధంగా స్పందించారు. ముందు కార్మికులకు పట్టెడు అన్నం పెట్టాలని, ఆ తర్వాత మిగిలిన విషయాలు చూడాలని అన్నారు కోట శ్రీనివాసరావు. దీంతో మెగా ఫ్యామిలీ అంటే పడని కొంతమంది ఆ విషయాల్ని పట్టుకొని మెగాస్టార్ కోట కామెంట్స్ అంటూ వైరల్ చేసేశారు. అయితే అలా వైరల్ చేసినవాళ్లకు, ఆ మాట అన్న వాళ్లకు చిరంజీవి…
ప్రజలకు చేసే సాయం ఏంటి అనేది తెలుసు. అలాగే సినీ కార్మికుల కోసం కరోనా విపత్తు సమయంలో ఆయన తీసుకున్న చొరవ కూడా తెలుసు. సీసీసీ అనే ట్రస్టు ఏర్పాటు చేసి ఆయన తొలుత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించి సినీ కార్మికుల నిత్యావసరాలు తీర్చారు. ఆ తర్వాత ఆక్సిజన్ బ్యాంక్‌లు కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవలు అందించారు. అవన్నీ కోట శ్రీనివాసరావుకు ఎందుకు కనిపించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్, నెటిజన్లు.
గతంలో ‘మా’ ఎన్నికల సమయంలో కోట బ్యాకప్ ఇచ్చిన వారి గురించి కూడా ఈ సందర్భంగా ట్వీట్లలో ప్రస్తావనలు వస్తున్నాయి. వాళ్లేం చేశారు, చేస్తున్నారు అనే మాటలూ వినిపిస్తున్నాయి. మరోవైపు నటనలో రామ్ చరణ్ ఇంకా వృద్ధి చెందాలని కోట చెప్పారు. ఇది కూడా చరణ్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’లో చరణ్ నటన అదిరిపోయిందని, ఇప్పుడు కోట ఇలా అనడం సరికాదు అంటున్నారు. దీంతో అసలు కోట కావాలనే ఇలా అంటున్నారా, లేక ఎవరైనా అనిపిస్తున్నారా అనే ప్రశ్న మొదలైంది.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!