Kalki Movie: ‘కల్కి’ విషయంలో టీమ్‌ ఆలోచన ఏంటి… ఇంత మంది స్టార్లను ఇరికిస్తున్నారా?

పెద్ద సినిమా… ఈ పదానికి అర్థాలు చాలానే ఉన్నాయి. పెద్ద స్టార్లు నటిస్తున్న సినిమా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా.. ఇవన్నీ కాకుండా నిడివి ఎక్కువున్న సినిమా. అయితే ఈ మూడు కలసి వస్తున్న సినిమాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి ఒకప్పటి ‘ప్రాజెక్ట్‌ కె’… ఇప్పటి ‘కల్కి 2898 ఏడి’. అవును ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా గురించే ఇదంతా. ఈ సినిమాలో నటిస్తున్న, భాగమవుతున్న నటుల సంఖ్య, అందులోనూ పెద్ద నటుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

కమల్‌ హాసన్‌తో మొదలైన ఈ ప్రవాహం.. ఇప్పుడు దుల్కర్‌ సల్మాన్‌ వరకు వచ్చింది. ‘బాహుబలి’ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన ప్రభాస్‌.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఇబ్బందిపెట్టే ఫలితాలే అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ స్థాయి విజయం కోసం ‘కల్కి’ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాకు భారీ తారాగణమే ఎంచుకున్నారు. ఈ సినిమాలో (Kalki Movie) ప్రభాస్‌ సరసన దీపిక పడుకొణె నటిస్తుండగా… కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ వచ్చారు.

దీంతో సినిమాకు భారీతనం వచ్చేసింది. రూ.500 కోట్ల బడ్జెట్‌ అనేసరికి మరింత పెరిగింది. సినిమాను రెండు ముక్కలు చేసేంత కంటెంట్‌ ఉంది అనేసరికి ఇంకా పెరిగిపోయింది. అంతా హైప్‌ వచ్చిన ఈ సినిమాలోకి విలన్‌గా కమల్‌ హాసన్‌ వచ్చారు. అప్పుడు సినిమా జనాలు ‘వామ్మో’ అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలోకి మరో హీరో కూడా వచ్చాడు అనేసరికి ‘ఇదేంట్రా బాబోయ్‌… ఇంత మంది హీరోలా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ఈ జోరు చూస్తుంటే ఇంకెంతమంది హీరోలు వస్తారో ఈ సినిమాలోకి..

మల్టీస్టారర్‌లకు ఇది బాప్‌ అంటూ సంబరపడిపోతున్నారు. అయితే డైనో‘స్టార్‌’ ఉండగా.. ఈ స్టార్లు ఉండాలా అనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ‘మహానటి’ సమయంలో కూడా వైజయంతీ మూవీస్‌ ఇలా అగ్ర తారల్ని సినిమాలోకి తీసుకొచ్చింది. అయితే అందులో ఆ స్టార్‌ హీరోల అవసరం ఆ సినిమాలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో అంటే కచ్చితంగా పాన్‌ ఇండియా బజ్‌ కోసమే అని అర్థమవుతోంది. మరి అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి తీసుకొస్తారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus