నాగ్..ఎందుకో ఆ మౌనం
- February 27, 2017 / 06:00 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో ఏం జరిగినా…ఇట్టే మీడియాకు లీక్ అయిపోతుంది…ఎవరు చెప్తారో…ఎలా చెప్తారో తెలీదు కానీ…మీడియా మాత్రం అక్కడెక్కడో జరిగిన న్యూస్ ను అందరికీ చూపించే ప్రయత్నంలో సెలెబ్రెటీస్ జీవితాలతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది…..విషయంలోకి వెళితే…కింగ్ నాగార్జున విషయమే తీసుకుంటే…సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటం నాగ్ వ్యవహార శైలి అని అందరికీ తెలిసిందే…..అయితే చాలా సున్నితంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా….తాను సైతం ఇబ్బంది పడకుండా నాగ్ పనులను చక చకా చక్కబెట్టుకుంటాడు అని అందరికీ తెలిసిందే…ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నా అవి ఏమి పట్టించుకోకుండా నాగ్ మౌనంగా రోజులు గడుపుతూ ఉండటం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది.
టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినపడుతున్న వార్తల ప్రకారం నాగ్ ప్రస్తుతం సినిమా రంగంలోని తన సన్నిహితులకు కూడ అందుబాటులో ఉండటం లేదు అని టాక్. టాలీవుడ్ సినిమా రంగంలో నాగార్జునతో ఆత్మీయంగా ఉండే చాలామంది అఖిల్ వార్తలు బయటకు వచ్చిన తరువాత నాగ్ ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రావడం లేదు అని అంటున్నారు. ఇలా నాగార్జున అఖిల్ వ్యవహారంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటించడానికి అసలు కారణం ఏంటి అంటే…శ్రీయ భూపాల్ తో ఎంతో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగిన ఫంక్షన్ కు వెళ్ళినవారికి ఆ ఫోటోలను చూసిన వారికి ఈ ప్రేమ జంట ఎందుకు విడిపోయింది అన్న సందేహాలు కలవడం సహజం. ఇప్పుడు అదే పరిస్థితి నాగార్జునకు కూడ ఉందని టాక్. దీనితో త్వరలో ఏమైనా శ్రీయ అఖిల్ లు మనస్సు మార్చుకుని కలుస్తారేమో అని ఎదురు చూస్తున్నాడట నాగార్జున. మరి అదే నిజం అయితే మాత్రం ఈ జంట తమ నూరేళ్ళ జీవితానికి ఓనమాలు దిద్దుకునే రోజు త్వరలోనే రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















