Nikhil: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రిలీజ్..ను నిఖిల్ పట్టించుకోవడం లేదా? కారణం!

‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ (Nikhil) .. ఆ తర్వాత ’18 పేజెస్’ అనే సినిమా చేశాడు. అది యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత ‘స్పై’ అనే సినిమా చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో నిఖిల్ కొంచెం అలర్ట్ అయ్యాడు. సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అతను ‘స్వయంభు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదొక పాన్ ఇండియా సినిమా. దీనికి కోసం గెటప్ కూడా మార్చాడు.

Nikhil

కండలు పెంచడానికి కూడా జిమ్ లో చాలా కష్టపడుతున్నాడు. నిఖిల్ నెక్స్ట్ సినిమా ఇదే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాతో అతను పెద్ద హిట్ కొట్టడం గ్యారెంటీ అని కూడా అనుకున్నారు. అయితే ఇంతలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా నిఖిల్ నుండి వస్తున్నట్టు ప్రకటన వచ్చింది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. కాంబినేషన్ అయితే క్రేజీ గానే ఉంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా బాగుంది.

కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పుడు కంప్లీట్ చేశారు? అనే విషయం చాలా మందికి తెలీదు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. 40 శాతం కంప్లీట్ అయ్యి హోల్డ్ లో పడింది. ఈ విషయాన్ని ‘రావణాసుర’ సినిమా టైంలో దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ‘స్పై’ రిలీజ్ అవ్వడం.. దాని తర్వాత నిఖిల్ ‘స్వయంభు’ చిత్రానికే అరెస్ట్ అవ్వడం జరిగింది.

అలాంటప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం లేదు. అంటే షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఉన్నారు మేకర్స్. నవంబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి నిఖిల్ వస్తాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ ని నిఖిల్ (Nikhil) తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది లేదు కాబట్టి.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus