ఎంత పెద్ద సినిమా తీసినా.. దానికి సరైన ప్రచారం చేయకపోతే ప్రజల్లోకి వెళ్లదు, వెళ్లలేదు అంటారు. ఈ సూత్రాన్ని సినిమా వాళ్లంతా పక్కగా ఆచరిస్తుంటారు. అందుకే సినిమాలో మేటర్ లేకపోయినా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. సినిమాలో స్టఫ్ ఉన్నవాళ్లు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చేస్తారు. ఏదైతేనేం ప్రచారం అయితే చేస్తారు. అయితే ‘బీస్ట్’, ‘కేజీయఫ్ 2’ టీమ్ అలా అనుకోవడం లేదు. ఎందుకీ డౌట్ అంటారా. ఇంకా సినిమా రిలీజ్‌కి గట్టిగా వారం ఉంది, ఇంకా ప్రచారం మొదలవ్వలేదు.
‘బీస్ట్, ‘కేజీయఫ్ 2’… రెండూ పాన్ ఇండియా సినిమాలే. తమిళ, కన్నడ ఇండస్ట్రీల స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఇవి. రెండింటి మీదా భీరీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా తెలుగులో ఆడేయడానికి ఇది మాత్రం సరిపోదు. కనీస ప్రచారం అయినా ఉండాలి. లేకపోతే ఇక్కడివాళ్ల వసూళ్లు వద్దని ప్రేక్షకులు అనుకునే అవకాశం ఉంది. గతంలో ఒకటి, రెండు సినిమాలు ఇలా ప్రచారం చేయక ఇబ్బంది పడ్డాయి. అంతెందుకు ‘కేజీయఫ్’ మొదటి పార్ట్ ఇదే ఇబ్బంది పడింది.
సినిమా వస్తున్నట్లు కూడా చాలామందికి తెలియదు. మౌత్ టాక్‌తో సినిమా జనాల్లోకి వెళ్లి అప్పుడు చూశారు. అయితే ఇది అప్పుడు. అందులోనూ ఒకటే సినిమా అప్పుడు. కానీ ఇప్పుడు ‘బీస్ట్’తో ‘కేజీయఫ్ 2’కి, ‘కేజీయఫ్ 2’కి బీస్ట్‌తో పోటీ ఉంది. ఈ సమయంలో ఇద్దరూ ప్రచారం చేయకుండా ఉండటం అంటే కష్టమే. ‘బీస్ట్’ను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ప్రచారం విషయంలో ఆయన టీమ్ పక్కాగా ఉంటుంది. కానీ ఈసారి లేట్.
దిల్ రాజు టీమ్ ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ప్రచారం, విజయ్ 66వ సినిమా పనిలో ఉండటంతో చేయడం లేదు. ఇక ‘కేజీయఫ్ 2’కి అయితే ట్రైలర్ ఈవెంట్ ఒకటి చేశారు. ఆ తర్వాత ఇంకేమీ లేవు. ఇంకా వారం మాత్రం ఉందని మరోసారి గుర్తు చేసుకొని ప్రచారం షురూ చేస్తూ ఇండస్ట్రీకి మంచిది. అన్నట్లు ‘బీస్ట్’ నుండి రెండు పాటలు, ట్రైలర్ వచ్చాయి. అయితే తెలుగు కోసం స్పెషల్‌గా చేసినవి కావు. తమిళ సినిమా కోసం చేసిన వాటికి డబ్బింగ్ వెర్షన్ అంతే.