Salaar 2: స్పెషల్‌ డే నాడు ‘సలార్‌ 2’ అప్‌డేట్‌ రాలేదు ఎందుకు? ఏమైంది?

‘సలార్‌’ (Salaar)ఎంత పెద్ద సినిమానో చెప్పండి, ఎన్ని నెలలు షూటింగ్‌ చేశారో చెప్పండి అంత పెద్ద సినిమాను అన్ని రోజుల్లో ఎన్ని ఫొటోలు క్లిక్‌ చేసుంటారో కదా. ఎంత వీడియో ఫుట్‌ షూట్‌ చేసుంటారో కదా. ఇంత స్టఫ్‌ ఉన్నా సినిమా టీమ్‌కు అక్టోబరు 23న రిలీజ్‌ చేయడానికి ఒక్క కొత్త ఫొటో, కొత్త వీడియో దొరకలేదా? ఏమో టీమ్‌ చేసిన పని చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభాస్‌ (Prabhas) పుట్టిన రోజు సందర్భంగా టీమ్‌ నుండి ఎలాంటి కంటెంటూ రాలేదు.

Salaar 2

కావాలంటే మీరే ‘సలార్’ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ చూడండి. నిన్నంతా ఒక్కటంటే ఒక్కటీ ‘సలార్‌ 2’ (Salaar 2) అప్‌డేట్‌ లేదు. ‘ది రాజా సాబ్’ (The Rajasaab)  టీమ్‌ నుండి ఓ షాకింగ్‌ లుక్‌ వచ్చింది. ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అప్‌డేట్‌ను మైత్రి మూవీ మేకర్స్‌ ఇచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) టీమ్‌ ఓ ఫన్నీ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. కానీ ‘సలార్: శౌర్యంగపర్వం’ నుండి ఎలాంటి కంటెంట్‌ కూడా రాలేదు.

అయితే ‘సలార్‌’ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌ అయితే తమ ప్లాట్‌ఫామ్‌లో సినిమిఆ ఘనతనున వివరిస్తూ ఓ పోస్టు పెట్టింది. ఆ ఫొటో వైరల్‌ అవ్వడం, దాని ఒరిజినల్‌ కోసం ఫ్యాన్స్‌ అడుగుతుండటంతో ఆ ఒరిజినల్‌ పిక్‌ను హంబలే టీమ్‌ ట్వీట్‌ చేసింది. అంతేతప్ప సినిమా టీమ్‌ నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఎందుకు చెప్పలేదు అనే చర్చ మొదలైంది. అన్నట్లు ‘ది రాజా సాబ్‌’ సినిమా పోస్టర్‌ను ట్వీట్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

దీంతో అసలు ఏం జరుగుతోంది. ఒక్కటంటే ఒక్క ఫొటో కూడా టీమ్‌ దగ్గర లేదా? అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు ‘సలార్‌ 2’ సినిమా అసలు ఇప్పట్లో ఉందా? అనే ప్రశ్న కూడా వస్తోంది. నిజానికి ఈ పాటికి సినిమా మొదలవ్వాలి. అయితే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) , హీరో ప్రభాస్‌ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఆలస్యమవుతోంది అని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus