ఆలోచించడి! వై నాట్ ఎ గర్ల్ ?
‘సృష్టి కర్త ఒక బ్రహ్మ,కాని తనని సృష్టించిది ఒక అమ్మ’ అనే సంగతి ఎంత మందికి తెలుసు?ప్రపంచం లో ప్రతి ఒక్కరికి జన్మనిచేది అమ్మ మాత్రమే.నవ మాసాలు మనల్ని మోసి,కని,ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మాతృమూర్తి దే.అమ్మగా,అక్కగా,చెల్లిగా,భార్యగా,స్నేహితురాలిగా మనకు ఎప్పుడు అండగా ఉండేవారే ఈ స్త్రీ మూర్తులు.కాని ప్రస్తుత సమాజం ఎలా ఉంది.ప్రపంచం లో స్త్రీలు దేవతలగా పూజింపబడేది ఒక మన భారత దేశం లోనే.కాని నేడు అదే ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే,అబార్షన్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న లోకం లో ఉన్నాం.ఎందుకు ఆడపిల్లల పట్ల ఇంత వివక్ష?మనకు భార్య కావలి కాని తనకి ఆడపిల్లపుట్టకూడదు.
ఆడపిల్ల పుడితే చదువులు,ఖర్చులు కట్నాలు,బరువు,అనుకొనే వాళ్ళందరూ కూడా అమ్మే మళ్లీ పుట్టిందని అనుకొనే రోజు రావాలి.ఆడపిల్లని బరువుగా కాదు,భాద్యతగా,అదృష్టం గా బావించాలి.మనం నాగరికత లో ముందున్నా, ఆడపిల్లని కాదనుకొనే అజ్ఞానంలో ఉన్నాం.అలాంటివాళ్ళ కి కనువిప్పుకలిగేలా,ఆడపిల్లల అవసరాన్ని,ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించేలా,ప్రతి తల్లిదండ్రులలో మార్పు తీసుకొచ్చేలా చెయ్యడానికి రన్ వే రీల్స్ రూపొందించిన “వై నాట్ ఎ గర్ల్” అనే షార్ట్ ఫిలిం దోహదం చేస్తుంది అని చెప్పడానికి మేము నిజం గా చాల గర్విస్తున్నాం.
ఈ షార్ట్ ఫిలిం లో హీరో గా నటించిన “నందు”,ఈ చిత్రం లో ఆధ్బుతమైన నటన తో ఆకట్టుకొన్నాడు.ఇటువంటి సందేశాత్మక లఘు చిత్రం లో నటించడం వల్ల తన ఇమేజ్ చాల బాగా పెరిగింది.చూసిన ప్రతిఒక్కరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.
హీరోయిన్ పావనిరెడ్డి, ఈ చిత్రం లో అమ్మగా పోషించిన పాత్ర, ఆమె కెరీర్ ఎదుగుదలకు దోహదం చేస్తుందని చెప్పవచు. ఇక ఆమె నటన అత్యంత అధ్బుతం.
ముఖ్యం గా ఈ లఘు చిత్రం లో ఉన్న పాట వీక్షకులను విపరీతం గా ఆకర్షించింది, దానికి కారణం కార్తిక్ కొడకండ్ల అధ్బుతమైన మ్యూజిక్ ఇవ్వడం. ఇక ఈ పాటలో విసువల్స్ ను సూపర్ గా చిత్రించాడు సినిమా ఫోటో గ్రాఫర్ రాహుల్ మాచినేని.
ఈ కథను దర్శకుడు సునీల్ పుప్పాల, తానే రచించి, అధ్బుతంగా తెరక్కేకించాడు. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో హుందాగా క్లారిటీ గా కొత్త దానం ఉట్టిపడేలా చిత్రీకరించాడు.
ఎన్నో సందేశాత్మక చిత్రాలను నిర్మించి,రిలీజ్ చేసిన ‘రన్ వే రీల్స్’ ఈ సినిమాను యు ట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇటువంటి సందేశాత్మక చిత్రాలను అందించడం లో ఎప్పుడు ముందు ఉంటుంది రన్ వే రీల్స్, రన్ వే రీల్స్ అనే సంస్థ ఎప్పుడు యువత లో ఉన్న ప్రతిభ ను, కొత్తదనాన్నిప్రోత్సహిస్తూ,చాల మంది కొత్త దర్శకులను, నటీ నటులను పరిచయం చేసింది.
ఈ చిత్రాన్ని యు ట్యూబ్ లో చూడాలనుకునే కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి వీక్షించగలరు.