ఆ ఘోరప్రమాదం పై ఇంత వరకు నోరుమెదపని రజిని కాంత్

కొద్దిరోజుల క్రితం తమిళ పరిశ్రమలో ఓ విషాదం చోటు చేసుకుంది. భారతీయుడు 2 షూటింగ్ సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భారీ క్రేన్ పైనుండి జారిపడటంతో అక్కడిక్కడే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. దర్శకుడు శంకర్ కి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాగా ఈ సంఘటనకు తమిళ పరిశ్రమ సంఘీభావం ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న కమల్ హాసన్ మృతుల కుటుంబ సభ్యులను స్వయంగా కలవడంతో పాటు, ఒక్కొక్క కుటుంబానికి కోటిరూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీసం భీమా కూడా లేదని బాధపడ్డారు.

కోలీవుడ్ సినీ పెద్దలలో ఒకరిగా, సూపర్ స్టార్ హోదాలో ఉన్న రజిని ఈ విషయంపై స్పందించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన రజిని కాంతి కనీసం ఓ సోషల్ మీడియా పోస్ట్ కూడా చేయకపోవడం అనేక విమర్శలకు దారితీస్తుంది. రజిని తీరుపై చాల మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసేవలోకి రావాలనుకుంటున్న రజినీకి కనీసం తన పరిశ్రమకు చెందిన కార్మికుల పట్ల బాధ్యతలేదు అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు. తోటి హీరో కమల్ ఏకంగా మూడు కోట్లు విరాళం ప్రకటించగా రజిని కనీసం కుటుంబానికి దైర్యం చెవుతూ స్పందించకపోవడం బాధాకరం.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus