‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’, ‘పుష్ప ఎక్కడ’. ఫస్ట్ డైలాగ్ కొన్నేళ్ల పాటు దేశ సినీ పరిశ్రమను కుదిపేస్తే, రెండో ప్రశ్న కొన్ని రోజులపాటు టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ‘పుష్ప’ ఎప్పుడు, అప్డేట్ ఎప్పుడు అనే ప్రశ్న వినిపిస్తోంది అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే.. ఈ రెండు ప్రశ్నల స్థాయిలో టాలీవుడ్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. అదే ‘సాయిపల్లవి ఎక్కడ?’. అవును మీరు చదివింది నిజమే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయడం లేదు.
కోట్ల రూపాయలు ఇస్తామన్నా సరే… పాత్ర నచ్చితేనే సినిమాలు ఒప్పుకునే రకం సాయిపల్లవి. చిరంజీవికి సోదరిగా నటించమని అడిగితేనే సున్నితంగా తిరస్కరించింది. సాయిపల్లవి సినిమాల ఎంపిక అలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎంపిక కారణంగానో, ఇంకే కారణంగానో తెలియదు కానీ.. చాలా రోజులుగా ఆమె సినిమాలు చేయడం లేదు. వరుసగా కుర్ర హీరోయిన్లు వస్తున్నారు కాబట్టి.. తెలియడం లేదు కానీ.. ఆమె లేని లోటు అలానే ఉంది.
‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ రూపంలో రెండు హిట్లు తర్వాత ‘విరాట పర్వం’ రూపంలో కమర్షియల్ ఫ్లాప్‌కు ఆమెకు ఎదురైంది. ఆ సినిమాలో నటన పరంగా మంచి పేరు వచ్చినా… సక్సెస్ కాకపోవడంతో ఇబ్బందిగా మారింది. అదే సమయంలో చేసిన ‘గార్గి’ పరిస్థితి కూడా ఇంతే. మరోవైపు దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నా… రెగ్యులర్ క్యారెక్టర్లకు ఆమె ససేమిరా అనడమే తాజా గ్యాప్‌కు కారణం అని చెబుతున్నాయి సన్నిహిత వర్గాలు.
ప్రస్తుతం సాయి పల్లవి (Sai Pallavi) శివ కార్తికేయన్ జోడిగా పీరియాడిక్ సినిమా ఒకటి చేస్తోంది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రమిది. ఆర్మీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్నలో కథానాయిక పాత్ర చాలా కీలకమట. అందుకే ఆమె ఓకే చెప్పింది అంటున్నారు. మరోవైపు నాగ చైతన్య – చందూ మొండేటి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో సాయిపల్లవిని అడిగారు అంటున్నారు. ఇందులో సాయిపల్లవిని అడిగారని టాక్. మరి ఆమె ఓకే చేస్తుందేమో చూడాలి.