క్రేజ్, గ్లామర్ ఉంచుకొని ఇలాంటి సినిమాలెందుకు

హాట్ యాంకర్స్ జాబితాలో టాప్ లిస్ట్ లో ఉండే శ్రీముఖి యాంకర్ గా బిజీ అవ్వడానికి ముందే సినిమాల్లో బాగా బిజీ ఉండేది. బడా దర్శకుల టాప్ లిస్ట్ లో ఉండేది శ్రీముఖి. ఆ తర్వాత ఉన్నట్లుండి బరువు పెరగడం, టీవీ షోల్లో ఊపిరి సలపనంతగా బిజీ అయిపోవడంతో అమ్మడికి సినిమా ఆఫర్లు తగ్గాయి. అయితే.. ఈటీవీ, మాటీవీ, జీటీవీ వంటి అన్ని ప్రముఖ చానల్స్ లో షోస్ హోస్ట్ చేసే అవకాశం దక్కడంతో సినిమాల మీద కాన్సన్ ట్రేషన్ తగ్గించింది శ్రీముఖి.

మధ్యలో ధనరాజ్ తో “ధనలక్ష్మి తలుపు తడితే” అనే సినిమా చేసింది. ఆ తర్వాత హర్షవర్ధన్ దర్శకత్వంలో “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా ఇప్పటివరకు విడుదలవ్వలేదు కూడా. భవిష్యత్ లో విడుదలవుతుందో లేదో కూడా తెలియదు. మరి సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో.. లేక సరైన ఆఫర్లు రాక, వచ్చిన ఆఫర్ని వదులుకోకూడదు అనే ఇంటెన్షన్ తో సినిమాలు ఒప్పేసుకుంటుందో తెలియదు కానీ.. ఆమె ఒకే చేస్తున్న సినిమా లిస్ట్ చూస్తే మాత్రం “ఏంటీ సినిమాలు?!” అనుకోక మానరు ఎవరూ.

ఇక రీసెంట్ గా రిలీజైన “క్రేజీ అంకుల్స్” ట్రైలర్ చూసినోళ్లయితే మరీ ఈ బీగ్రేడ్ సబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది అర్ధం కాలేదు. ఒకవైపు తనకంటే వయసులో సీనియర్ అయిన అనసూయ మంచి ఇంట్రెస్టింగ్ కథలతో దూసుకుపోతుంటే.. శ్రీముఖి మాత్రం ఇలాంటి సినిమాలు చేస్తుండడం ఆమె కొద్దిపాటి అభిమానులకు మింగుడుపడడం లేదు. మరి శ్రీముఖి ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus