Sukumar: అంచనాల బరువు పెంచుకున్నారు.. టీమ్‌ మరోసారి ఆలోచించుకోవాలా?

సినిమాకు హైప్‌, ప్రచారం, క్రేజ్‌.. ఇలా ఏది రావాలన్నా అది ఫస్ట్‌లుక్‌తోనే స్టార్ట్‌ అవుతుంది. అంటే ఈ మధ్య ప్రీలుక్‌లు అని ఏవేవో వస్తున్నాయి అనుకోండి. కానీ సినిమాను జనాల్లోకి బాగా తీసుకెళ్లేది, అందరూ డిస్కస్‌ చేసుకునేలా చేసిది ఫస్ట్‌లుక్కే. అలాంటి ఫస్ట్‌ లుక్ విషయంలో సినిమా టీమ్‌లు ఎంతగా కసరత్తు చేస్తాయో మనందరికీ తెలుసు. రకరకాల స్టైల్స్‌, కాస్ట్యూమ్స్‌, లెక్కలు చూసుకుంటారు. అన్నీ సమపాళ్లలో కొలతేసి పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తారు. ఆ పోస్టర్‌ ఎక్కడ తేడా కొట్టేస్తుందేమో అని భయపడుతూనే ఉంటారు.

అలాంటి పోస్టర్‌ క్లైమాక్స్‌ లాంటి కిక్‌ ఇస్తే.. వాళ్ల పంట పండినట్లే. అలాంటి పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. అవును గంగమ్మ జాతరలోని వేషాల నేపథ్యంలో ‘పుష్ప’రాజ్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ‘పుష్ప’ టీమ్‌. స్టైలిష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌ అంటూ బన్నీని స్టైల్‌ఐకాన్‌ను చేసేశారు ఫ్యాన్స్‌. అతను కూడా ఫ్యాషన్‌, లుక్‌ కోసం చాలా కష్టపడతారు. అలాంటి బన్నీ నుండి ఇలాంటి లుక్‌ వచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు.

అసలు బన్నీని ఈ లుక్‌ కోసం ఎలా ఒప్పించి ఉంటారు అంటూ లెక్కలేసుకున్నారు కూడా. అయితే, ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. బన్నీ లుక్‌తో ఫ్యాన్స్‌కి ఎంత కిక్‌ వచ్చిందో తెలియదు కానీ.. ఆ లుక్‌ ఇచ్చిన కిక్‌తో టీమ్‌కి మాత్రం భలే కష్టం వచ్చిపడింది అని చెప్పొచ్చు. లుక్‌తో టీమ్‌ చాలా అంచనాలు పెంచుకుంది. లుక్‌ను భారీగా ఉండి.. సినిమాలో సరకు లేకపోతే ఏమవుతుందో శంకర్‌ – విక్రమ్‌ ‘ఐ’ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ‘పుష్ప : ది రూల్‌’ విషయంలో ఈ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి.

దాని కోసం టీమ్‌ ఇప్పటివరకు ఎంత కష్టపడిందో ఇప్పుడు అంతకుమించి పడాల్సి ఉంటుంది. అంటే ముందే క్లైమాక్స్‌ లాంటి కిక్‌ వచ్చేస్తే.. ఇంటర్వెల్‌కి, ప్రీ క్లైమాక్స్‌కి, క్లైమాక్స్‌కి ఇంకెంత మజా తీసుకురావాలో, దాని కోసం ఇంకెంత రాయాలి, ఇంకెంత కష్టపడాలి చెప్పండి. ఇప్పుడు టీమ్‌ అదే పనిలో ఉండుంటారు కూడా. అంటే తమకు తామే గీత గీసి.. దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్‌ టీమ్‌.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus