Sunny: సన్నీకి సోషల్ మీడియాలో ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా..?

బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో హీరోగా మారుతునే ఉంటారు. లాస్ట్ సీజన్ లో సోహైల్, అభిజీత్ , అరియానా, హారిక, అఖిల్, మోనాల్ ఇలా అందరికీ కూడా మంచి పేరు వచ్చింది. అలాగే, ఈసారి కూడా ప్రియాంక, షణ్ముక్, సిరి, శ్రీరామ్, మానస్ , కాజల్ లకి మంచి పేరు వచ్చింది. అయితే, అనూహ్యంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో హీరోగా మారాడు సన్నీ. ఎవరూ ఊహించని క్రేజ్ వచ్చింది సన్నీకి. అసలు సన్నీకి ఎందుకింత క్రేజ్ వచ్చింది.

ఎవరి వల్ల ఈ క్రేజ్ వచ్చిందనేది ఒక్కసారి చూసినట్లయితే, ఫస్ట్ రెండు , మూడు వారాలు అసలు సన్నీ గేమ్ ఎలా ఉందో కూడ ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే టాస్క్ ఆడేటపుడు సిరి టీషర్ట్ లో చేయి పెట్టాడు అనే నిందని ఎదుర్కున్నాడో అప్పట్నుంచీ హైలెట్ అయ్యాడు సన్నీ. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ నుంచీ వ్యతిరేఖతని ఎదుర్కుని కత్తిపోట్లని తిన్నాడు. దీంతో సింపతీ బాగా పెరిగింది. ఇక నామినేషన్స్ అప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన హంటర్ టాస్క్ లో హైలెట్ అయ్యాడు.

అరటిపండుని తీస్కుని నామినేషన్స్ ని స్వీకరించాల్సిన టైమ్ లో ప్రియ చెప్పిన రీజన్ ని తీసుకుని రవిని నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక్కడే లాజిక్ గా మాట్లాడుతూ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ప్రియ టవల్ సోఫా మీద ఆరేశాడు అని సిల్లీ రీజన్ చెప్తూ రవిని నామినేట్ చేసింది. కేవలం సన్నీని టెస్ట్ చేసేందుకే ఈరీజన్ చెప్పింది. అది తెలుసుకున్న సన్నీ, నాతో గేమ్ ఆడతారా..? నేను ఇప్పుడు ఆడతాను అని ఈ నామినేషన్ ని స్వీకరించి రవిని నామినేట్ చేశాడు. కేవలం నామినేట్ చేయడమే కాకుండా , తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్వేత కోసం రవిని నామినేట్ చేస్తున్నానని,

శ్వేత ఎలిమినేషన్ కి రవినే ఒకరకంగా కారణమని చెప్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. చెట్టుకి వేళ్లాడుతున్న కోతిని తెంచి నామినేషన్స్ లో వేశాడు. ఈ కోతి టాస్క్ లోనే క్రేజ్ ని సంపాదించాడు సన్నీ. అక్కడ్నుంచీ సన్నీపేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. అంతకుముందు కూడా బ్యాటిన్స్ టాస్క్ లో ప్రియా మగాడివైతే రా ఆడు చూద్దాం అంటూ రెచ్చగొట్టింది. ఆ తర్వాత గుడ్ల టాస్క్ లో కూడా చెంప పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రతిసారి ఇలా మాటల పడటం , ప్రియ రెచ్చగొట్టడం అనేది సన్నీకి బాగా కలిసొచ్చింది.

ఆ తర్వాత కెప్టెన్సీ టవర్ టాస్క్ లో సిరితో జరిగిన అప్పడం లొల్లి హౌస్ లో కలకలం సృష్టిస్తే, నాగార్జున ఇచ్చిన జడ్జిమెంట్ కి సన్నీకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మొత్తానికి ఇలా ప్రియ, సిరి ఇద్దరూ కూడా సన్నీకి బూస్టప్ ఇవ్వడంలో హెల్ప్ చేశారనే చెప్పాలి. ఇక వీకండ్ నాగార్జున ఎపిసోడ్ లో కాజల్ , అనీమాస్టర్ ఇద్దరూ స్టాండ్ తీస్కోవడం అనేది సన్నీకి హైప్ ఇచ్చింది. ఈసీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి వచ్చిన విజె సన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుని టైటిల్ రేస్ లో ముందుకు వెళ్తున్నాడు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus