తెలుగు సినిమా పరిశ్రమ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కోపం? ఈ మాట మనం తరచుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి అడుగుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ తెలుగు సినిమాకు సరైన గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి. కొంతమంది హీరోల సినిమాలు ఏపీలో విడుదలైనప్పుడు ఎందుకో ఎక్కడ లేని రూల్స్ గుర్తొచ్చేస్తుంటాయి. అదే ఇతర భాషల నుండి డబ్బింగ్ అయ్యి వచ్చిన సినిమాల విషయంలో విషయంలో రావు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు పక్క రాష్ట్రంలో తమిళనాడుకు కూడా పాకిందా? ‘టైగర్ 3’ సినిమా వచ్చాక అదే అనిపిస్తోంది.
పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి తమిళనాడు సర్కారు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోలు చేసిన సినిమాలకు ఉదయం ఆట ఉండదు అనేది ఆ నిర్ణయం సారాంశం. అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండవు అన్నమాట. దీంతో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’, కార్తి ‘జపాన్’ ఇలా పెద్ద సినిమాలు రోజుకు నిర్ణీత (గతంలో ఉన్నట్లుగా) ఆటలతోనే ప్రదర్శితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాలకు షోస్ పడినా.. సొంత రాష్ట్రంలో ఇవ్వలేఉద.
అయితే, ఇటీవల విడుదలైన హిందీ డబ్బింగ్ సినిమా (Tiger) ‘టైగర్ 3’ విషయంలో ఇలాంటి రూల్స్ ఏవీ పాటించలేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఉదయం 7 గంటల నుండే వేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆడియన్స్ స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒకే టైమ్‌లో సినిమా షోలు పడతాయని చెప్పారు. చెప్పినట్టుగానే తమిళనాడులో కూడా ఈ సినిమాకు ఉదయం ఆటలు ఇచ్చారు. దీంతో విజయ్, రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ అభిమాన హీరోల సినిమాలకు ఇవ్వని ప్రత్యేక అనుమతులు సల్మాన్ ఖాన్ సినిమాకు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో కొన్ని మల్టీప్లెక్సుల్లో ఉదయం 7 గంటలకే ‘టైగర్ 3’ షోలు పడ్డాయి. ఈ మేరకు టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలోని స్క్రీన్ షాట్లను విజయ్, రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే పని దినాల్లో ప్రత్యేక అనుమతులు ఇవ్వకూడదని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ‘టైగర్ 3’ సినిమా ఆదివారం వచ్చింది కాబట్టి ఇచ్చారు అని మరికొందరు వాదిస్తున్నారు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!