తారకరత్న ఇటీవల కన్నుమూసినప్పటి నుండి ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ‘మా సినిమాలో ఛాన్స్ ఇద్దామనుకున్నాం, మాట్లాడేశాం కూడా.. కానీ ఇంతలో ఇలా!’. ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. అభిమానులు, సగటు ప్రేక్షకుల్లో మాత్రం ఈ మాటలు కాస్త చిరాకును కలిగిస్తున్నాయనే మాట మాత్రం వాస్తవం. ఈ మాట మేం అనడం లేదు. సోషల్ మీడియాలో అక్కడక్కడ ఈ డిస్కషన్ నడుస్తోంది. తారకరత్న 2002లో ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఎంట్రీనే 9 సినిమాల ఓపెనింగ్‌తో రికార్డు స్థాయిలో జరిగింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన కెరీర్ ఏమంత సాఫీగా లేదు. 2009 వరకు కాస్త బాగున్నా.. ఆ తర్వాత అడపాదడపా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వచ్చారు. 2016లో విలన్‌గా మారారు. ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించారు. అలా 2022 వరకు ఆయన ముఖానికి రంగేసుకుంటున్నా.. సరైన ప్రాజెక్ట్ రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన చనిపోయాక ఆయన కోసం పాత్ర ఆఫర్ చేశాం,
క్యారెక్టర్ రాశాం అనే మాటలు ఎంత వరకు నమ్మొచ్చు అనే ప్రశ్న తలెత్తుతోంది. అది కూడా ఏమంత చిన్న సినిమాలు కాదు. ఒకటి ప్రభాస్ – నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’, మరొకటి బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా. ఈ రెండు సినిమాలు ఎంత పెద్దవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో తారకరత్నకు హీరోగా హిట్ సినిమా తీసిన వైజయంతి మూవీస్‌లో ఒక సినిమా, బాబాయి బాలకృష్ణతో ఒక సినిమా.
మరోవైపు పొలిటికల్‌గా కూడా ఇలాంటి మాటే వినిపించింది. ఇన్నాళ్లూ తారకరత్నకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ ఇటీవల ఆసక్తిగా కనిపించారు. అయితే ఆయన పోటీ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. టీడీపీ నుండి కూడా ఎక్కడా సమాచారం రాలేదు. కానీ ఆయన చనిపోయాక ‘తారకరత్న ఈ సారి పోటీ చేస్తాం అన్నారు’ అని చెప్పారు. దీంతో చనిపోయాక ఎందుకు చెబుతున్నారు. ముందే అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు కదా అంటున్నారు నెటిజన్లు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?