నేను సినిమాలూ చేస్తా, రాజకీయమూ చేస్తా… ఎందుకంటే నాకు రెండూ రెండు కళ్లు లాంటివి అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూ ఉంటారు పవన్ కల్యాణ్. అయితే ఈ రెండింటికీ కలిపడం ఆయనకు అంతగా ఇష్టం ఉండదు. రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే అని చెబుతుంటారు. కానీ కీన్‌గా చూస్తే ఇందులో అది, అందులో ఇది కలిసి కనిపిస్తుంటాయి. సినిమా బహిరంగ సభల్లో రాజకీయాల గురించి మాట్లాడతారు. (భీమ్లా నాయక్ సభలో అంతగా మాట్లాడలేదు అనుకోండి) అలాగే సినిమాల్లో తన రాజకీయ వాసనను తీసుకొస్తుంటారు.
పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరంగా వెళ్లారు. అయితే రాజకీయాల్లో సరైన ప్రభావం చూపించలేకపోయారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీకి ఒక్క స్థానమే వచ్చింది. దీంతో ఇక పవన్ రాజకీయాలకు దూరం అనుకున్నారు. కానీ పవన్ అలా ఆలోచించ లేదు. ప్రజలు తనను ఆదరించకపోయినా, ప్రజల కోసం తాను ఉన్నాను అని నిలబడి చూపించాడు. ఎప్పటికప్పుడు తన గళం వినిపిస్తూనే ఉన్నాడు. రాజకీయాలకు చిన్న గ్యాప్ ఇచ్చి…
తిరిగి సినిమాల్లోకి వచ్చి తనదైన శైలిలో సినిమాలు ఎంచుకుంటూ పాత పవన్ కల్యాణ్‌ఉన గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మధ్యమధ్యలో తిరిగి రాజకీయాలకు వెళ్తూ, మళ్లీ ఇటొస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఒక్కోసారి రెండు పడవలను కలిపేస్తున్నాడు. ఇంతకుముందు చెప్పినట్లు ఇందులో అది, అందులో ఇది కలిపేస్తుంటారు. ఆ మధ్య ‘వకీల్‌సాబ్’లోనూ జనాల మీద డైలాగ్‌లు వేశారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లోనూ అదే పని చేశారు. తన మీద సోషల్ మీడియాలో ఇతర పార్టీల సభ్యులు, నాయకులు వేసే డైలాగ్‌లకు పవన్ సినిమా ద్వారా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు.
‘వకీల్ సాబ్’లో జనాల తనను ఆదరించికపోయినా, తన వారి కోసం ఎప్పుడూ ముందుంటాను అంటూ ఎమోషనల్ క్లైమాక్స్ డైలాగ్స్ చెప్పించారు. ఇప్పుడు ‘వకీల్‌సాబ్‌లో ‘నన్ను తొక్కేయ్ లేస్తా.. పీకేయ్ మళ్లీ మొలుస్తా.. తోసేయ్ మళ్లీ వస్తా’ అంటూ రానాతో చెప్పాడు పవన్. అయితే దీని వెనుక పొలిటికల్ ఇంటెన్షన్ ఫ్యాన్స్‌కు తెలుసు. అలాగే యుద్ధంలో ఓడిపోతామని భయం లేని వాడు ఎవరికీ తలవంచడు అంటూ ఇంకో మాట అన్నాడు పవన్.
అయితే ఇక్కడ ఒకటే డౌట్… ఈ డైలాగ్‌లు ప్రజలకు అర్థమవుతాయా? వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయా? అయితే హ్యాపీనే. కాకపోతేనే నోటి తుప్పర్లు దండగ అనే ఊరి మాట గుర్తొస్తుంది. గతంలో చిరంజీవి విషయంలో ఈ డైలాగ్స్ ఏ మాత్రం వర్కవుట్ అవ్వేలేదు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో?