నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి,అను ఇమ్మాన్యుయేల్ అత్యంత కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ కొంత గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేసిన సినిమా ఇది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతా ఆర్ట్స్’ వంటి పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమా ఇది. అందుకే మొదటి నుండి ఈ సినిమా ఆడియన్స్ అటెన్షన్ ని డ్రా చేసింది.
మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. 2వ వీకెండ్ కూడా డీసెంట్ అనిపిస్తుంది. ఓవర్ సీస్ బయ్యర్స్ కి అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.

ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే : :
| నైజాం | 2.70 cr |
| సీడెడ్ | 0.70 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.55 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.95 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.25 cr |
| ఓవర్సీస్ | 2.70 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 9.9 కోట్లు(షేర్) |
‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమాకి రూ.9.9 కోట్ల షేర్ వచ్చింది(ప్రీమియర్స్ తో కలుపుకుని). ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.2.9 కోట్ల ప్రాఫిట్స్ ని సాధించింది. రెండో వీకెండ్ కి కూడా ఈ సినిమా డీసెంట్ అనిపిస్తుంది.ఆదివారం కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
