Pawan Kalyan: లీక్‌లు పొంగల్‌ అంటున్నాయి.. ప్రొడ్యూసర్‌ అనడం లేదట.. మరి ఎప్పుడంటే?

  • August 13, 2023 / 09:40 PM IST

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఇటీవల కాలంలో చాలా వేగంగా, పక్కాగా తెరకెక్కుతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘ఓజీ’ అని చెప్పాలి. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం పూర్తయిపోయింది. దీంతో ఇటీవల ఓ పుకారు మొదలైంది. అదే ఈ సినిమా రిలీజ్‌ డేట్. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, లుక్‌, టీజర్‌ అనే మాటలు వినిపించేవి. అయితే ఏమైందో ఏమో గత కొన్ని రోజులుగా సినిమా రిలీజ్‌ డేట్‌ పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ డేట్‌ నిజం కాదు అని అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమా విడుదలైన తర్వాత తర్వాతి సినిమాల చిత్రీకరణల వేగం పెరుగుతుంది అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ‘ఓజీ’ సినిమా ఈ ఏడాది ఆఖరులో వస్తుందని, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సంక్రాంతికి వచ్చేస్తుందని ఓ లీక్‌ బయటకు వచ్చింది. వినడానికి ఈ పుకార్లు బాగుండటం, వచ్చే ఏడాదిలో ఏపీలో ఎన్నికలు ఉండటంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే పవన్‌ ‘వారాహి యాత్ర’ మూడో విడత స్టార్ట్‌ చేసేశారు. దీంతో ఆ రెండు సినిమాల విషయంలో వార్తలు పుకార్లే అని తేలిపోయాయి.

ఇప్పుడు వీటి విషయంలో ఇంకాస్త క్లారిటీ వచ్చింది. అదే ‘ఓజీ’ రిలీజ్‌ డేట్. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భోగట్టా. ఇంకా మిగిలిన షూటింగ్‌ అంటే 40 శాతం సినిమాను పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుంది అంటున్నారు. అందుకే ఈ ఏడాది ఆఖరులో సినిమా రావడం కష్టం అంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత దానయ్య వర్గాల నుండి సినిమా సమ్మర్‌లోనే అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘ఓజీ’కి సంబంధించి అంత గజిబిజీగా ఉంది అని ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే మరోవైపు సినిమా ప్రచారాన్ని షురూ చేశారు. ఇటీవల టీజర్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ దగ్గర్లో లేకుంటే ఇప్పుడు పోస్టర్లు ఎందుకో అనే డౌట్‌ కూడా ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus