Pawan Kalyan: ‘భవదీయుడు..’ గురించి ఏదో క్లారిటీ ఇచ్చేయొచ్చుగా!

సినిమా అనౌన్స్‌ చేసి, పోస్టర్‌ రిలీజ్‌ చేసి, రేపో మాపో షూటింగ్‌ అని చెబుతూ చెబుతూ.. ఇంకా చెబుతూనే ఉంటే.. అది కచ్చితంగా ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అనౌన్స్‌ అయిన ఈ సినిమా విషయంలో రోజుకో వార్త బయటకు వస్తుంది. సినిమా ఉందని, లేదని, తర్వాత ఉండొచ్చని, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారని.. ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

దీంతో అభిమానులతో ఏంటీ ‘సీ.. సా..’ ఆట అని కొంతమంది నెటిజన్లు విసుక్కుంటున్నారు. ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అని గూగుల్‌లోనో, సోషల్‌ మీడయా ప్లాట్‌ఫామ్స్‌లోనో సెర్చ్‌ చేస్తే.. ఎన్నో వార్తలు కనిపిస్తాయి. అయితే ఏ రెండింటికీ సారూప్యత ఉండదు. ఎందుకంటే ఈ సినిమా గురించి టీమ్‌ ఏ విషయమూ అధికారికంగా చెప్పడం లేదు. అలా అని వస్తున్న పుకార్లను ఆపే ప్రయత్నం కానీ, ఖండించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో అసలు ఏమైంది, ఏమవుతోంది, ఏమవుతుంది అనే విషయాలు తెలియక ఇబ్బందిపడుతున్నారు అభిమానులు.

‘గబ్బర్‌ సింగ్‌’ కాంబో ఈజ్‌ బ్యాక్‌ అంటూ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ గురించి అభిమానులు చాలా అంచనాలే పెట్టుకున్నారు. సింగిల్‌ పోస్టర్‌తో ఆ అంచనాల్ని అందుకునేలా కనిపించింది. టీమ్‌ కూడా ఈ సినిమా గురించి బాగా కష్టపడుతోంది అని వార్తలొచ్చాయి. అయితే పవన్‌ కల్యాణ్‌ రాజకీయం – సినిమా అనే డబుల్‌ సెయిలింగ్‌లో ఉండటంతో సినిమా ఉందా? లేదా? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాను పక్కనపెట్టి పవన్‌ వేరే సినిమాలు చేయడమూ ఈ చర్చకు ఓ కారణం.

ఈ క్రమంలో పవన్‌ ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ని వెనక్కి ఇచ్చేస్తున్నారనే టాక్‌ కూడా వచ్చింది. అయితే పవన్ అతి త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను మొదలెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నిన్న రాత్రి ఓ టాక్‌ బయటకు వచ్చింది. సినిమా పూజా కార్యక్రమాలతో త్వరలో స్టార్ట్‌ అవుతుందని అంటున్నారు. అయితే దీనిపై ఎప్పటిలానే ఎలాంటి అఫీషియల్‌ న్యూస్‌ రాలేదు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus