Adi Reddy: ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్ లో గెలిచాడా..? కెప్టెన్సీ టాస్క్ లో జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం మిషన్ ఇంపాజబుల్ అంటూ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రెడ్ టీమ్, బ్లూటీమ్స్ గా విడిపోయి టాస్క్ ఆడారు హౌస్ మేట్స్. ప్రస్తుతానికి ఒక ఛాలెంజ్ లో గెలిచి రెడ్ టీమ్ మరో ఛాలెంజ్ లో కూడా గెలిచినట్లుగా సమాచారం. దీంతో ఎక్కువ మంది రెడ్ టీమ్ సభ్యులు బ్రతికి ఉండటంతో రెడ్ టీమ్ విజయం సాధించింది.

ఇక్కడే బ్లూటీమ్ లో స్క్వాడ్ లీడర్ అయిన ఆదిరెడ్డికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బాత్రూమ్ ని అపరిశుభ్రంగా మార్చి దాన్ని రెడ్ టీమ్ లో సభ్యుల్లో ఎవరో ఒకరిపైన నింద వేయాలని చెప్పాడు. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి గెలిచినట్లుగా సమాచారం. ఆదిరెడ్డి గెలిచి ఒక ఇంటి సభ్యుడ్ని లైవ్ లోకి తెచ్చినా కూడా బ్లూటీమ్ ఓడిపోయింది. ఇక మార్నింగ్ బాలాదిత్య లైటర్ విషయంలో, అలాగే సిగరెట్స్ దాచడం విషయంలో గీతుని తప్పుబడ్డాడు ఆదిరెడ్డి.

పర్సనల్ గా బాధపడుతుంటే ఓదార్చాడే తప్ప, గీతుది మాత్రం తప్పనే చెప్పాడు. ఇక టాస్క్ లో వీరిద్దరి మద్యలో కూడా గట్టిగా ఫైట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఆదిరెడ్డి దగ్గర ఉన్న స్ట్రిప్స్ ని గీతు తీసేసుకుంది. దీన్ని ఆదిరెడ్డి గేమ్ విషయంలో ఫైయిర్ కాదని గీతుతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి రివ్యూవర్స్ మద్యలో గట్టి ఫైట్ అయినట్లుగా సమాచారం. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచీ గీతుతో ఆదిరెడ్డి కలిసే ఉన్నాడు.

అంతేకాదు, చాలా విషయాల్లో గీతుకి స్టాండ్ కూడా తీస్కున్నాడు. కానీ, ఇప్పుడు బాలాదిత్య మేటర్లో కొద్దిగా ఎగైనిస్ట్ అయ్యాడు. టాస్క్ లో గీతుకి సర్ధిచెప్తునే ఉన్నాడు. లాస్ట్ టైమ్ కూడా గీతు గేమ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తోందని, నామినేషన్స్ లో నాన్సెస్ మాట్లాడావని చెప్పాడు. కానీ, గీతు వినిపించుకోలేదు. ఇప్పుడు వీరిద్దరి మద్యలో ఈటాస్క్ చిచ్చుపెట్టింది. మరి ఈ గొడవ ఎంతదూరం వెళ్లింది ? ఎవరు గెలిచారు ? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus