2018 సంవత్సరం జులై 12వ తేదీన విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ సినిమాలోని పిల్లారా సాంగ్ అంచనాలకు మించి హిట్ కావడంతో పాటు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన చేతన్ భరద్వాజ్ కు ఈ సినిమా సక్సెస్ తో మంచి పేరు వచ్చింది.
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అజయ్ భూపతి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతారని అందరూ భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా మహాసముద్రం సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. మహాసముద్రం సినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలో ఈ దర్శకుడు తడబడ్డారని కామెంట్లు వినిపించాయి.
చాలామంది దర్శకులలా ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేసే విషయంలో అజయ్ భూపతి ఫెయిలయ్యారు. ఈ దర్శకుడు ప్రస్తుతం మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సాధారణంగా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి.
అజయ్ భూపతి మ అనే అక్షరంతో తెరకెక్కించిన మహాసముద్రం ఫ్లాపైనా ఈ డైరెక్టర్ మాత్రం మళ్లీ మ అనే అక్షరంతో తెరకెక్కుతున్న మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అజయ్ భూపతి సెంటిమెంట్లను పట్టించుకోరా? లేక సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఈ విధంగా చేస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.