Allu Arjun: పుష్పతో బన్నీ టార్గెట్ ను రీచ్ అవుతారా..?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరైనోడు మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు బన్నీ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు బోయపాటి శ్రీను ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణతో అఖండ మూవీ తెరకెక్కిస్తుండగా నిన్నటినుంచి బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

అయితే బన్నీ సన్నిహితులు మాత్రం ఈ వార్త నిజం కాదని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నా పుష్ప సినిమా తర్వాత మాత్రం బన్నీ బోయపాటి శ్రీను డైరెక్షన్ చేసే సినిమాలో నటించే ఛాన్స్ అయితే లేదని బన్నీ సన్నిహితులు వెల్లడిస్తున్నారు. బోయపాటి శ్రీను తన సినిమాల్లో హీరోలను ఎక్కువగా మాస్ హీరోలుగా చూపిస్తారనే సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో ప్రస్తుతం బన్నీ మాస్ హీరో పాత్రలోనే నటిస్తున్నారు.

వరుసగా మాస్ సినిమాల్లో బన్నీ నటించే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. అయితే సరైనోడుతో వచ్చిన మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పుష్ప సినిమాతో మరింత పెంచుకోవాలని బన్నీ భావిస్తున్నారు. పుష్ప మూవీతో బన్నీ అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus