నందమూరి తారక రామారావుగారి చిన్న కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మాస్ లో బాలకృష్ణకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన్ని గాడ్ ఆఫ్ మాసెస్ అని అంటారు. అలా అని ఆయన ఒక్క మాస్ సినిమాలే చేస్తూ కూర్చోలేదు. తన తండ్రిలాగే పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు. రాముడు, కృష్ణుడు.. వంటి పాత్రలు బాలయ్య కూడా చేశారు. భైరవద్వీపం వంటి సోషియో ఫాంటసీ మూవీ, ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్ మూవీ, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రాలు చేసిన ఘనత బాలయ్యకు సొంతం.
ఎటువంటి పాత్రకైనా తన నటనతో నిండుతనం తీసుకొస్తాడు బాలయ్య. అయితే మధ్యలో బాలయ్య మాస్ ఇమేజ్ ను కొంతమంది దర్శకులు తప్పుదోవ పట్టించారు . బాలయ్య స్టార్ ఇమేజ్ ను 10 రెట్లు పెంచిన బి.గోపాలే పలనాటి బ్రహ్మనాయుడు వంటి ఔట్ ఆఫ్ బాక్స్ చిత్రాన్ని అందించి అభిమానులను నిరుత్సాహపరిచిన సంగతి తెలిసిందే. ఇక విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, పరమ వీర చక్ర వంటి సినిమాలు బాలయ్య అంటే ట్రోల్ మెటీరియల్ అన్నట్టు మార్చేశాయి. అయితే బాలయ్య స్ట్రెంత్ ను, ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకున్నది దర్శకుడు బోయపాటి శ్రీను.
బాలయ్య నాన్ స్టాప్ గా డైలాగులు చెప్పగలడు. కానీ బాలయ్య స్లోగా.. డైలాగులు చెబితే ఎలా ఉంటుందో.. ఇంగ్లీష్ పదాలు కూడా అందులో మిక్స్ చేస్తో ఎంత డైనమిజం ఏర్పడుతుందో అని చాటి చెప్పాడు బోయపాటి. అందుకే ఈ కాంబోలో హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. అయితే బోయపాటి ఫాలో అయిన టెక్నిక్ నే అందరు దర్శకులు ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇటీవల వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. బాలయ్య ప్లస్ పాయింట్స్ అంటే నరకడమే..
అన్నట్టు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు గోపీచంద్ మలినేని. కథలో బలమైన ఎమోషన్ లేదు. సంక్రాంతి సీజన్ కు ఈ సినిమా రావడం, అలాగే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమా సేఫ్ అయ్యింది. వేరే సీజన్లో కనుక రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉండేదో.. కూడా అందరికీ ఓ ఐడియా వచ్చేస్తుంది. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి కూడా మలినేని తరహాలోనే సినిమా చేస్తే.. మాత్రం అభిమానులకు కూడా బోర్ కొట్టేయడం ఖాయం. కాబట్టి.. బాలయ్య ప్లస్ పాయింట్స్ ను వదలకుండా బలమైన కథతో కనుక ఆయనతో సినిమా చేస్తే భారీ హిట్టు కొట్టొచ్చు అనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?