Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bindu Madhavi: ‘బిగ్ బాస్’ విన్నర్ బిందు మాధవి కెరీర్ ఊపందుకుంటుందా?

Bindu Madhavi: ‘బిగ్ బాస్’ విన్నర్ బిందు మాధవి కెరీర్ ఊపందుకుంటుందా?

  • May 24, 2022 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu Madhavi: ‘బిగ్ బాస్’ విన్నర్ బిందు మాధవి కెరీర్ ఊపందుకుంటుందా?

బిందు మాధవి… బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా గత రెండు రోజులుగా ఈమె ట్రెండింగ్లో ఉంది. అయితే ఈమె గతంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అన్న సంగతి ఎక్కువ మందికి గుర్తులేదు. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్మాణంలో రూపొందిన ‘ఆవకాయ బిర్యానీ’ తో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగమ్మాయి అని కూడా బహుశా చాలా మందికి తెలిసుండదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మదనపల్లి ఈమె సొంత ఊరు. అంతేకాదు ‘లీడర్’ ‘బంపర్ ఆఫర్’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

తెలుగులో ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదని భావించి తమిళ్ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఈమె సంతృప్తి చెందలేదు. దాంతో కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ ‘బిగ్ బాస్’ లో మిడ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 5 లో నిలిచింది. ఇప్పుడు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగులో ‘బిగ్ బాస్’ స్టార్ట్ అయ్యాక ఓ లేడీ విన్నర్ అవ్వడం ఇదే మొదటి సారి.

అయితే బిందు మాధవి కెరీర్ ఇక నుండీ ఊపందుకుంటుందా? ‘బిగ్ బాస్’ విన్నర్ ఇమేజ్ ఆమెకు ఎంత వరకు కలిసొస్తుంది? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. తెలుగులో ‘బిగ్ బాస్’ విన్నర్ అయిన వాళ్ళంతా.. టైటిల్ విన్నర్ గా నిలిచిన నెల రోజుల వరకు వార్తల్లో నిలిచారు కానీ తర్వాత వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. సినిమాల్లో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళ ఆలోచనలు కూడా తలక్రిందులు అయ్యాయి.

మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ ‘మా’ అసోసియేషన్ పేరు చెప్పుకుని మొన్నామధ్య కనపడ్డాడు కానీ తనకి సినిమాల్లో అవకాశాలు భారీగా వచ్చిన సందర్భాలు లేవు.

రెండో సీజన్ విన్నర్ కౌశల్ ను వాళ్ళ ఆర్మీనే పట్టించుకోవడం మర్చిపోయింది. ‘బిగ్ బాస్’ విన్నర్ ఇమేజ్ తో ఇతను హీరో అయిపోతాడు, విలన్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు.

మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనకి వచ్చిన పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.. అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తున్నాడు కానీ బిగ్ బాస్ ఇమేజ్ తో నటుడిగా నిలదొక్కుకున్న సందర్భాలు ఏమీ లేవు.

నాలుగో సీజన్ విన్నర్ అభిజీత్ సంగతి ఇక చెప్పనవసరం లేదు. అతనికంటే సోహెల్ ఎక్కువ పాపులర్ అయ్యాడు, సినిమాల్లో నటిస్తున్నాడు.

ఐదవ సీజన్ విన్నర్ సన్నీ కూడా బుల్లితెర పై తప్ప ఇక ఎక్కడా కనిపించడం లేదు. తను హీరోగా నటించిన పాత సినిమాలు కూడా విడుదల కావడం లేదు.

ఇవన్నిటినీ బట్టి..బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచినా ఆ ఇమేజ్ తో ఈమె నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందా? లేదా అనేది చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bindu Madhavi
  • #Bindhu Madhavi
  • #Bindu
  • #Bindu Madhavi

Also Read

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

related news

Dhandoraa Collections: వీకెండ్ తర్వాత చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీకెండ్ తర్వాత చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

17 mins ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

1 hour ago
Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

4 hours ago
Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

4 hours ago
NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

18 hours ago

latest news

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

1 hour ago
Malavika Mohanan: ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఇబ్బందిపెట్టారు.. మాళవిక షాకింగ్‌ కామెంట్స్‌

Malavika Mohanan: ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఇబ్బందిపెట్టారు.. మాళవిక షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Mana Shankara Vara Prasad Garu: ఆ మూడు సినిమాల మిక్సింగే ఈ సినిమా.. ఇంతేగా అనిల్‌ ఇంతేగా!

Mana Shankara Vara Prasad Garu: ఆ మూడు సినిమాల మిక్సింగే ఈ సినిమా.. ఇంతేగా అనిల్‌ ఇంతేగా!

3 hours ago
Varanasi :’వారణాసి’ మూవీ టీజర్ రిలీజ్ కు సర్వం సిద్ధం..!

Varanasi :’వారణాసి’ మూవీ టీజర్ రిలీజ్ కు సర్వం సిద్ధం..!

4 hours ago
Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version